Hero Xpulse 200T 4V: హీరో ఎక్స్‌పల్స్ 200టీ 4వీ బైక్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పూర్తి వివరాలు ఇవే
Hero Xpulse 200T 4V: హీరో ఎక్స్‌పల్స్ 200టీ 4వీ బైక్ భారత మార్కెట్‍లోకి వచ్చేసింది. 200సీసీ 4 వాల్వ్ కూల్డ్ ఇంజిన్‍ను ఈ నయా మోటార్‌సైకిల్ కలిగి ఉంది.
Hero Xpulse 200T 4V launched: కొత్త ఎక్స్‌పల్స్ 200టీ 4వీ బైక్‍ను హీరో మోటోకార్ప్ లాంచ్ చేసింది. 200సీసీ ఇంజిన్ ఉన్న ఈ మోటార్‌సైకిల్‍ను నేడు (డిసెంబర్ 20) ఇండియాలో విడుదల చేసింది. అమ్మకానికి కూడా వచ్చేసింది. ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, పర్ఫార్మెన్స్ వివరాలు ఇవే.
ఇంజిన్ ఇలా..
Hero Xpulse 200T 4V: బీఎస్6 200cc 4వాల్వ్ ఆయిల్-కూల్డ్ ఇంజిన్‍తో హీరో ఎక్స్‌పల్స్ 200టీ 4వీ వస్తోంది. 8,500 rpm వద్ద 18.8 bhp పవర్ ను, 6,500 rpm వద్ద 17.3 Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ ఉత్పత్తి చేస్తుంది. ముందు మోడల్ కంటే ఈ 6 శాతం ఎక్కువ పవర్ ఉంటుంది. అలాగే 5 స్పీడ్ గేర్ బాక్స్ ఈ బైక్‍కు ఉంటుంది.
Hero Xpulse 200T 4V: ఫ్రంట్‍లో 37mm ఫోర్క్స్, వెనుక 7 స్టెప్ మోనో షాక్ యూనిట్‍తో ఈ హీరో ఎక్స్‌పల్స్ 200టీ 4వీ వస్తోంది. ముందు 276 mm డిస్క్, వెనుక 220 mm డిస్క్ బ్రేకింగ్ విధులను నిర్వర్తిస్తాయి.
ఫీచర్లు
Hero Xpulse 200T 4V Features: పూర్తి డిజిటల్ ఎల్‍సీడీ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్‌ను ఈ హీరో ఎక్స్‌పల్స్ 200టీ 4వీ మోటార్‌సైకిల్ కలిగి ఉంది. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఫోన్‍కు కనెక్ట్ చేసినప్పుడు ఈ క్లస్టర్‌లో కాల్ అలెర్ట్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‍ను పొందవచ్చు. సీట్ కింద యూఎస్‍బీ చార్జర్, గేర్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ సెన్సార్ కూడా ఉన్నాయి.
డిజైన్
Hero Xpulse 200T 4V Design: నియో రెట్రో స్టైలింగ్, బోల్డర్ గ్రాఫిక్స్ తో ఈ కొత్త హీరో ఎక్స్‌పల్స్ 200టీ 4వీ వస్తోంది. రౌండ్ షేప్ ఫుల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉంది. దీనికి ఓ వైజర్‌తో కూడిన క్రోమ్ రింగ్ కూడా ఉంది. దుమ్ము నుంచి ఫోర్క్స్ కు రక్షణగా ఫోర్క్ గైటెర్లను హీరో ఇచ్చింది. ఇక రిలాక్స్డ్ సీటింగ్ పొజిషన్‍ను ఈ బైక్ కలిగి ఉంది.
ధర, కలర్ ఆప్షన్లు
Hero Xpulse 200T 4V Price: హీరో ఎక్స్‌పల్స్ 200టీ 4వీ ధర రూ.1,25,726 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. స్పోర్ట్స్ రెడ్, మాట్ ఫంక్ లైమ్ ఎల్లో, మాట్ షీల్డ్ గోల్డ్ కలర్ ఆప్షన్‍లలో ఈ బైక్ అందుబాటులోకి వచ్చింది. హోండా హార్నెట్ 2, బజాజ్ పల్సర్ ఎన్ఎస్200, టీవీఎస్ అపాచె ఆర్టీఆర్ 200 4వీకి ఈ బైక్ పోటీగా అడుగుపెట్టింది.