Harley Davidson X440 : హార్లీ డేవిడ్సన్ ఎక్స్440.. వావ్! వాట్ ఎ బైక్..!
Harley Davidson X440 : హార్లీ డేవిడ్సన్ నుంచి త్వరలో రానున్న ఎక్స్440 బైక్ డిజైన్‌ను సంస్థ ఆవిష్కరించింది. లాంచ్ డేట్‌తో పాటు ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Harley Davidson X440 : హర్లీ డేవిడ్సన్ ఎక్స్440 బైక్.. జూలై 3న ఇండియాలో లాంచ్కానుంది. తాజాగా.. ఈ మేడ్ ఇన్ ఇండియా బైక్ డిజైన్‌ను సంస్థ రివీల్ చేసింది. యూఎస్ ఆధారిత హార్లీ డేవిడ్సన్, దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హీరో మోటోకార్ప్ కొలాబొరేషన్లో వస్తున్న తొలి వెహికిల్‌గా ఈ ఎక్స్440 గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ బైక్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
హర్లీ డేవిడ్సన్ ఎక్స్440- డిజైన్..
ఐకానిక్ ఎక్స్ఆర్1200 బైక్‌ను స్ఫూర్తి పొంది ఈ హర్లీ డేవిడ్సన్ ఎక్స్440ని రూపొందించినట్టు కనిపిస్తోంది. ఇందులో మస్క్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్, డీఆర్ఎల్తో కూడిన సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్‌లైట్, విండ్ హ్యాండిల్‌బార్, సింగిల్ పీస్ స్టెప్డ్- అప్ సీట్, రౌండ్ మిర్రర్స్, అప్స్వెప్ట్ ఎగ్సాస్ట్, టాపర్డ్ టెయిల్ సెక్షన్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్ వంటివి వస్తున్నాయి.
ఈ నియో రెట్రో రోడ్‌స్టర్‌లో సింగిల్ పాడ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. అలాయ్ వీల్స్ వస్తాయి. బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ వస్తుందని తెలుస్తోంది.
ఇదీ చదవండి:- Royal Enfield Hunter 350 vs Bajaj Avenger 220: ఒకే రేంజ్ ధరలో ఉన్న ఈ రెండు బైక్‍లు ఎలా ఉన్నాయి? ఏ అంశంలో ఏది బెస్ట్?
ఎక్స్440 ఇంజిన్ వివరాలు..
త్వరలోనే లాంచ్‌కానున్న ఈ బైక్‌లో వచ్చే ఇంజిన్ వివరాలను సంస్థ ఇంకా ప్రకటించలేదు. కాగా.. ఇందులో 440సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ వస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ ఇంజిన్ 38హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది.
Harley Davidson X440 price in India : ఇక ఈ మేడ్ ఇన్ ఇండియా బైక్ ఎక్స్‌షోరూం ధర రూ. 2.5లక్షలుగా ఉండొచ్చు. జులై 3 లాంచ్ డేట్ దగ్గరపడే కొద్ది.. ఈ బైక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి.
ఇక లాంచ్ తర్వాత.. ఈ హర్లీ డేవిడ్సన్ ఎక్స్440 బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, యెజ్డీ రోడ్‌స్టర్, హోండా హెచ్నెస్ సీబీ350, జావా 42 వంటి మోడల్స్‌కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
సంబంధిత కథనం