GST collections: పరుగులు పెడ్తున్న జీఎస్టీ వసూళ్లు; జూన్ లో 12 శాతం పెరుగుదల
GST collections: గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (Goods and Services Tax GST)) వసూళ్లు ఈ జూన్ నెలలో మరోసారి రూ. 1.6 లక్షల కోట్ల మార్కును అధిగమించాయి. 2023 జూన్ నెలలో గత సంవత్సరం జూన్ నెల లో కన్నా 12% అధికంగా జీఎస్టీ వసూళ్లు జరిగాయి.
GST collections: జూన్ నెలలో జీఎస్టీ (GST) వసూళ్లు రూ. 1.60 లక్షల కోట్ల రికార్డు మార్క్ ను మరోసారి అధిగమించాయని కేంద్ర ఆర్థిక శాఖ శనివారం ప్రకటించింది. జూన్ నెల జీఎస్టీ వసూళ్ల వివరాలను ఆర్థిక శాఖ శనివారం వెల్లడించింది.
GST collections: నాలుగో సారి..
జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత ఆ పన్ను వసూళ్లు రూ. 1.60 లక్షల కోట్లకు చేరడం ఇది నాలుగో సారి. అలాగే, రూ. 1.50 లక్షల కోట్ల మార్క్ ను అధిగమించడం ఇది ఏడోసారి. 2023, జూన్ నెలలో దేశవ్యాప్తంగా రూ. 1,61,497 కోట్ల జీఎస్టీ వసూలయిందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇందులో రూ. 31,013 కోట్ల సెంట్రల్ జీఎస్టీ (CGST), రూ. 38,292 కోట్ల స్టేట్ జీఎస్టీ (SGST), రూ. 80,292 కోట్ల ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST), రూ. 11,900 కోట్ల సెస్ (cess) వసూలయిందని వివరించింది.
CGST, SGST: 12% అధికం
రెగ్యులర్ సెటిల్మెంట్ అనంతరం జూన్ నెలలో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం రూ. 67,237 కోట్ల సెంట్రల్ జీఎస్టీ (CGST), రూ. 68,561 కోట్ల స్టేట్ జీఎస్టీ (SGST) అని వివరించింది. 2023 జూన్ నెలలో జీఎస్టీ వసూళ్లు గత సంవత్సరం (2022) జూన్ నెల జీఎస్టీ వసూళ్ల కన్నా 12% అధికమని ఫైనాన్స్ మినిస్ట్రీ వెల్లడించింది.