Google Pixel 9 : ఇంకొన్ని రోజుల్లో గూగుల్​ పిక్సెల్​ 9 లాంచ్​- ఫీచర్స్​ చూసేయండి..-google pixel 9 series launch in august features and more heres what we know so far ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Google Pixel 9 : ఇంకొన్ని రోజుల్లో గూగుల్​ పిక్సెల్​ 9 లాంచ్​- ఫీచర్స్​ చూసేయండి..

Google Pixel 9 : ఇంకొన్ని రోజుల్లో గూగుల్​ పిక్సెల్​ 9 లాంచ్​- ఫీచర్స్​ చూసేయండి..

Sharath Chitturi HT Telugu
Jul 07, 2024 09:37 AM IST

Google Pixel 9 India launch : గూగుల్​ పిక్సెల్​ 9 సిరీస్​ లాంచ్​కు రెడీ అవుతోంది. ఈ సిరీస్​లోని స్మార్ట్​ఫోన్స్​, వాటి ఫీచర్స్​కు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

గూగుల్​ పిక్సెల్​ 9 లేటెస్ట్​ అప్డేట్స్​..
గూగుల్​ పిక్సెల్​ 9 లేటెస్ట్​ అప్డేట్స్​.. (HT Tech)

మచ్​ అవైటెడ్​ గూగుల్​ పిక్సెల్​ 9 సిరీస్​పై ఇప్పటికే మంచి బజ్​ ఉంది. ఆగస్ట్​ 13న జరగనున్న ‘మేడ్​ బై గూగుల్​’ ఈవెంట్​లో ఈ స్మార్ట్​ఫోన్​ సిరీస్​ లంచ్​ అవుతుంనది టాక్​ నడుస్తోంది. దీనిని గూగుల్​ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ పిక్సెల్​ 9 సిరీస్​ కచ్చితంగా ఆగస్ట్​లోనే లాంచ్​ అవుతుందని అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సిరీస్​లోని స్మార్ట్​ఫోన్స్​పై ఎప్పటికప్పుడు బయటకు వస్తున్న ఫీచర్స్​ వివరాలతో పిక్సెల్​ 9పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సిరీస్​లో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ అనే నాలుగు మోడళ్లు ఉంటాయని రూమర్స్​ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సిరీస్​కి సంబంధించి, ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ డిజైన్, డిస్​ప్లే, కెమెరా..

ఇంతకు ముందు చెప్పినట్లుగా, పిక్సెల్ 9 సిరీస్ నాలుగు మోడళ్లను కలిగి ఉంటుంది. అన్నీ భిన్నమైన డిజైన్లు, స్పెసిఫికేషన్లతో వస్తాయి. కొత్త డివైజ్​లతో, గూగుల్ కొత్త కెమెరా మాడ్యూల్స్, పెరిగిన డిస్​ప్లే పరిమాణాలతో అనేక డిజైన్ మార్పులను తీసుకురావాలని భావిస్తున్నారు. స్టాండర్డ్ పిక్సెల్ 9 మోడల్ 6.03 ఇంచ్​ డిస్​ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. అయితే ప్రో మోడల్ డిస్​ప్లే పరిమాణాలు వరుసగా 6.1 ఇంచ్​, 6.7 ఇంచ్​లలో రావచ్చు. అదనంగా, స్మార్ట్​ఫోన్స్​ వెనుక ప్యానెల్ కర్వ్డ్ ఇంచెస్​తో హారిజాంటల్ కెమెరా బార్​ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అదనంగా, ఇది అడాప్టివ్ టచ్ ఫీచర్​ను కూడా కలిగి ఉంటుంది.

ఫోటోగ్రఫీ పరంగా, కెమెరా స్పెసిఫికేషన్ల గురించి రూమర్స్​ చాలా తక్కువగా ఉన్నప్పటికీ, పిక్సెల్ 8 మోడళ్లలో డ్యూయెల్ కెమెరా సెన్సార్​కు బదులుగా ట్రిపుల్ కెమెరా సెటప్​ను పిక్సెల్ 9 కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. మూడొవ కెమెరా సెన్సార్ టెలిఫోటో కెమెరాగా ఉంటుందని సమాచారం.

ఇదీ చూడండి:- Best gaming phones: రూ .20,000 లోపు ధరలో బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే..

గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ప్రాసెసర్, సాఫ్ట్​వేర్, బ్యాటరీ..

పిక్సెల్ 9 సిరీస్ రాబోయే అన్ని మోడళ్లు టెన్సర్ జీ4 చిప్​సెట్​తో పనిచేస్తాయని భావిస్తున్నారు. ఈ చిప్​సెట్ గత సంవత్సరం టెన్సర్ జీ3 చిప్​సెట్ కంటే మరింత శక్తివంతమైనదని భావిస్తున్నారు. ఇది కొత్త గెలాక్సీ ఏఐ ఫీచర్ల కోసం మెరుగైన ప్రాసెసింగ్​ను కలిగి ఉండవచ్చు (ఏవైనా ఉంటే). ఇంకా, కొత్త చిప్సెట్ వినియోగదారులకు మెరుగైన వేగం. ఆన్-డివైజ్ ఏఐ సామర్థ్యాలను అందించవచ్చు.

పిక్సెల్ 9 సిరీస్ రాబోయే ఆండ్రాయిడ్ 15 వెర్షన్​పై పనిచేస్తుందని గూగుల్ ఐ / ఓ ఈవెంట్​లో ప్రకటించారు. దీర్ఘకాల పర్ఫార్మెన్స్​ కోసం, స్మార్ట్​ఫోన్లు పెద్ద బ్యాటరీ పరిమాణాన్ని సపోర్ట్ చేసే అవకాశం ఉంది.

మరో విషయం! మనం ఇప్పుడు వాట్సప్ ఛానల్స్​లో ఉన్నాం! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం వాట్సప్​లో మన హెచ్​టీ తెలుగు ఛానెల్​ని సబ్​స్క్రైబ్​ చేసుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం