ShareChat layoffs : షేర్చాట్లోనూ జాబ్ కట్స్.. 20శాతం మంది ఉద్యోగుల తొలగింపు!
ShareChat layoffs 2023 : సంస్థలోని 20శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు షేర్‌చాట్ ప్రకటించింది. ఖర్చులు పెరగడం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
ShareChat layoffs 2023 : 2022లో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన 'జాబ్ కట్స్' వార్తలు 2023లోనూ కొనసాగుతున్నాయి. అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగించేందుకు సన్నద్ధమవుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ సోషల్ మీడియా షేర్‌చాట్ కూడా చేరింది! గూగుల్, టీమాసెక్ ఆధారిత ఈ షేర్‌చాట్.. తమ ఉద్యోగుల్లో 20శాతం మందిని తొలగిస్తున్నట్టు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ట్రెండింగ్ వార్తలు
‘ఖర్చులు పెరిగాయి.. తప్పడం లేదు’
బెంగళూరు ఆధారిత మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన షేర్చాట్తో పాటు ఇదే సంస్థకు చెందిన మోజ్ యాప్ నుంచి దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. 5 బిలియన్ డాలర్లు విలువ చేసే ఈ షేర్‌చాట్‌లో 2,200కుపైగా మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ShareChat layoffs : "మా వద్ద ఉన్న అత్యంత నైపుణ్యమైన ఉద్యోగుల్లోంచి 20శాతం మందిని తొలగిస్తున్నాము. సంస్థ చరిత్రలో మేము తీసుకుంటున్న అత్యంత కఠినమైన, బాధాకరమైన నిర్ణయం ఇదే. స్టార్టప్ జర్నీ నుంచి మాతో పాటు ఉన్న వారిని తొలగిస్తుండటం నిజంగా బాధాకరమైన విషయమే. కానీ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనేక కారణాల వల్ల.. జాబ్ కట్స్ తీసుకోవాల్సి వస్తోంది," అని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాస్ట్ కటింగ్ కారణంగా.. కొన్ని ప్రాజెక్టులను పక్కనపెడుతున్నట్టు.. కీలకమైన, ప్రముఖవైన వాటిపైనే దృష్టిసారించనున్నట్టు షేర్చేట్ వెల్లడించింది.
ShareChat layoffs news : "ఈ ఏడాది కూడా పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని అర్థమైంది. అందుకే చాలా చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాము. రానున్న రెండేళ్లు అత్యంత కఠినంగా ఉండున్నాయి. ఈ పరిస్థితుల నుంచి శక్తివంతంగా బయటపడతామని మాకు నమ్మకం ఉంది," అని షేర్‌చాట్ తెలిపింది.
జాబ్ కట్కు గురైన ఉద్యోగులకు.. నోటీస్ పీరియడ్‌కు సంబంధించిన పూర్తి జీతం, సంస్థలో ఎన్నేళ్లు పనిచేస్తే..దానికి తగ్గట్టు రెండు వారాల శాలరీ, 2022 డిసెంబర్ వరకు పూర్తి వేరియబుల్ పే, 2023 జూన్ వరకు ఆరోగ్య బీమా కవరేజీని ఇస్తున్నట్టు షేర్‌చాట్ ప్రకటించింది.
వీటితో పాటు 45రోజులకు సంబంధించిన సెలవులను ప్రస్తుత శాలరీకి తగ్గట్టు ఎన్‌క్యాష్ చేసుకునే వెసులుబాటు కల్పించింది షేర్‌చాట్. వీటికి అదనంగా.. లేఆఫ్‌కు గురైన ఉద్యోగులు.. ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకు సంస్థకు చెందిన ల్యాప్‌టాప్‌లను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.
1000 మంది అమెజాన్ ఉద్యోగులు..
Amazon Layoffs 2023 : గతేడాది భారీగా జాబ్ కట్స్ చేసిన అమెజాన్.. ఈ ఏడాది కూడా ఉద్యోగుల తొలగింపుపై దృష్టి పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ విభాగాల నుంచి మొత్తం 18 వేల ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆమెజాన్ ప్రకటించింది. అయితే, ఆ 18 వేలలో భారత్ నుంచి వెయ్యి మంది ఉన్నారని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం
Oyo to layoff 600 employees: భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న ఓయో..
December 03 2022
Zomato layoffs 2022 : జొమాటోలో ఉద్యోగాల కోత.. ఆ 3శాతం మంది ఇంటికి!
November 20 2022