Gold price today: హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు-gold and silver prices today on 05 06 2024 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Price Today: హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు

Gold price today: హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు

HT Telugu Desk HT Telugu
Jun 05, 2024 09:39 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా కొద్దిగా పెరిగాయి. ప్లాటినం రేట్లలో పెద్దగా మార్పు లేదు. మీ నగరంలో బంగారం, వెండి ధరలను చూడండి..

 మీ నగరంలో నేటి బంగారం ధరలు
మీ నగరంలో నేటి బంగారం ధరలు

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు బుధవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 66,810 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 66,800గా ఉండేది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,68,100 కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,681 కి చేరింది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర సైతం రూ. 10 పెరిగి.. రూ. 72,880కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 72,870 గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,28,800 గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,288 గా ఉంది.

ఢిల్లీ, చెన్నై ల్లో బంగారం ధరలు

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,960గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,030గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,810 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,880గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,460గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,590 గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,810 గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,880గాను ఉంది.

హైదరాబాద్​లో గోల్డ్​ ధర

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,810గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,880గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,860గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,930గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,810గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,880 గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

Silver price today : దేశంలో వెండి ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,410 గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 పెరిగి.. రూ. 94,100 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 94,700గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 98,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 94,100.. బెంగళూరులో రూ. 91,900గా ఉంది.

ప్లాటినం ధరలు ఇలా..

దేశంలో ప్లాటినం రేట్లు బుధవారం భారీగా తగ్గినవి. 10గ్రాముల ప్లాటినం ధర రూ. 660 తగ్గి.. రూ. 26,480 కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 27,140గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటినం ధర (10గ్రాములు) రూ. 26,480గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణనలోకి తీసుకోలేదు.)

WhatsApp channel