Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు మంగళవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 66,090కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 66,100గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,60,900కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 6,609గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 72,100కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 72,110గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 7,21,000గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,210గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,240గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,250గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,090 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 72,210గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,650గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,710గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 66,090గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,100గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,090గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,100గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,140గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,150గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,090గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,100గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Silver price today : దేశంలో వెండి ధరలు మంగళవారం పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,270గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 దిగొచ్చి.. రూ. 92,700కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 92,800గా ఉండేది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 97,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 92,700.. బెంగళూరులో రూ. 92,800గా ఉంది.
దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 60 తగ్గి.. రూ. 27,730కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 27,790గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,730గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
సంబంధిత కథనం