Gold and silver prices today : జులై 9- తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..-gold and silver prices today 9th july 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : జులై 9- తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : జులై 9- తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Sharath Chitturi HT Telugu
Jul 09, 2024 05:35 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు తగ్గాయి. వెండి ధరలు పెరిగాయి. ప్లాటీనం రేట్లు పడ్డాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు మంగళవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 67,440కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 67,450గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,74,400కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,744గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 73,570కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 73,580గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 7,35,700గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,357గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,590గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,720గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,440 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 73,570గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,990గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,170గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 67,440గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,570గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,440గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,570గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,490గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,620గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,440గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,570గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,510గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 పెరిగి.. రూ. 95,100కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 95,000గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 99,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 95,000.. బెంగళూరులో రూ. 93,900గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 180 తగ్గి.. రూ. 27,420కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 27,600గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,420గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం