Samsung Galaxy F23 5G : ఆఫర్​ అదిరింది.. రూ. 549కే శాంసంగ్​ బెస్ట్​ ఫోన్​!-get samsung galaxy f23 5g for just 549 price drops from 23999 in flipkart full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Get Samsung Galaxy F23 5g For Just 549, Price Drops From 23999 In Flipkart Full Details Here

Samsung Galaxy F23 5G : ఆఫర్​ అదిరింది.. రూ. 549కే శాంసంగ్​ బెస్ట్​ ఫోన్​!

Sharath Chitturi HT Telugu
Mar 23, 2023 03:54 PM IST

Offers on Samsung Galaxy F23 5G : శాంసంగ్​ గ్యాలెక్సీ ఎఫ్​23 5జీపై ఫ్లిప్​కార్ట్​లో అదిరిపోయే ఆఫర్​ నడుస్తోంది. ఆ వివరాలు..

ఆఫర్​ అదిరింది.. రూ. 549కే శాంసంగ్​ బెస్ట్​ ఫోన్​!
ఆఫర్​ అదిరింది.. రూ. 549కే శాంసంగ్​ బెస్ట్​ ఫోన్​!

Samsung Galaxy F23 5G Flipkart offers : డబ్బులను పొదుపు చేయాలని ఎవరికి ఉండదు? మరీ ముఖ్యంగా.. రూ. 23999 విలువ చేసే శాంసంగ్​ బెస్ట్ స్మార్ట్​ఫోన్​.. రూ. 549కే లభిస్తుంటే, సేవింగ్సే- సేవింగ్స్​ కదా! అవును.. మీరు చదివింది నిజమే. ఫ్లిప్​కార్ట్​లో.. డిస్కౌంట్​, ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ను కులుపుకుంటే.. రూ. 23999 ఉండాల్సిన శాంసంగ్​ గ్యాలెక్సీ ఎఫ్​23 5జీ స్మార్ట్​ఫోన్​ కేవలం రూ. 549కే లభిస్తోంది. ఆ వివరాలు..

ట్రెండింగ్ వార్తలు

వావ్​.. ఆఫర్​ అదిరింది!

Samsung Galaxy F23 5G price : క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 750జీ చిప్​సెట్​, 6జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్​తో కూడిన శాంసంగ్​ గ్యాలెక్సీ ఎఫ్​23 5జీ వేరియంట్​ వాస్తవ ధర రూ. 23999. ఫ్లిప్​కార్ట్​లో 33శాతం డిస్కౌంట్​ ఉంది. ఫలితంగా ఈ గ్యాడ్జెట్​ రూ. 15,999కే లభిస్తోంది.

ఇక ఏదైనా పాత​ స్మార్ట్​ఫోన్​ను ఇస్తే.. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ కింద రూ. 15,450 తగ్గుతోంది. డిస్కౌంట్​, ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ను కలుపుకుంటే.. ఈ శాంసంగ్​ గ్యాలెక్సీ ఎఫ్​23 5జీ స్మార్ట్​ఫోన్​ రూ. 549కే అందుబాటులో ఉన్నట్టు! అయితే.. మీరు ఇచ్చే పాత స్మార్ట్​ఫోన్​ వర్కింగ్​ కండీషన్​ బట్టి మీ ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి.

Offers on Samsung Galaxy F23 5G : ఇక ఈ మొబైల్​పై ఫ్లిప్​కార్ట్​లో వివిధ బ్యాంక్​ ఆఫర్స్​ కూడా ఉన్నాయి. శాంసంగ్​ యాక్సిస్​ బ్యాంక్​ క్రెడిట్​ కార్డ్​పై 10శాతం ఇన్​స్టెంట్​ డిస్కౌంట్​, ఎస్​బీఐ క్రెడిట్​ కార్డ్​ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్​పై (రూ.5000 విలువ చేసే ఆర్డర్లపై) రూ. 1000 డిస్కౌంట్​, ఫ్లిప్​కార్ట్​ యాక్సిస్​ బ్యాంక్​ కార్డ్​తో 5శాతం డిస్కౌంట్​ లభిస్తోంది.

ఫీచర్స్​ ఇవే..

శాంసంగ్​ గ్యాలెక్సీ ఎఫ్​23 5జీలో 6.6 ఫుల్​ హెచడీ+ డిస్​ప్లే, 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ప్యాక్​, ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ వంటి ఫీచర్స్​ ఉన్నాయి. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా లభిస్తోంది.

Samsung Galaxy F23 5G discounts in Flipkart : ఈ స్మార్ట్​ఫోన్​పై ఈ మధ్య కాలంలో వివిధ ఆఫర్స్​ లభిస్తోంది. వాటినిట్లోనూ ఇదే ది బెస్ట్​ ఆఫర్​ అని టెక్​ వర్గాలు చెబుతున్నాయి. ఆఫర్​ ఎండ్​ అయ్యేలోపే కొనుగోలు చేయాలని సూచిస్తున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం