Discounts on Maruti Suzuki cars : మారుతీ సుజుకీ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్​..!-discounts on maruti suzuki cars in august 2023 check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Discounts On Maruti Suzuki Cars : మారుతీ సుజుకీ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్​..!

Discounts on Maruti Suzuki cars : మారుతీ సుజుకీ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్​..!

Sharath Chitturi HT Telugu
Aug 05, 2023 09:30 AM IST

Discounts on Maruti Suzuki cars : ఆగస్ట్​ నెలలో మారుతీ సుజుకీ వాహనాలపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

మారుతీ సుజుకీ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్​..!
మారుతీ సుజుకీ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్​..! (REUTERS)

Discounts on Maruti Suzuki cars : మారుతీ నెక్సా రేంజ్​ కారును కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం! ఆగస్ట్​ నెలకు సంబంధించి.. పలు మోడల్స్​పై అదిరిపోయే డిస్కౌంట్స్​ను ప్రకటించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుతీ. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మారుతీ సుజుకీ ఇగ్నిస్​..

ఈ మోడల్​పై రూ. 35వేల క్యాష్​ బోనస్​, రూ. 15వేల ఎక్స్​ఛేంజ్​ బోనస్​, రూ. 10వేల అడిషనల్​ ఎక్స్​ఛేంజ్​ బోనస్​, రూ. 4వేల కార్పొరేట్​ బోనస్​, రూ. 5వేల స్క్రాపేజ్​ డిస్కౌంట్​ లభిస్తోంది. అన్ని కలుపుకుంటే ఇది రూ. 69వేల డిస్కౌంట్​!

ఇక ఇగ్నిస్​ స్పెషల్​ ఎడిషన్​పై రూ. 15,500 క్యాష్​ డిస్కౌంట్​, రూ. 15వేల ఎక్స్​ఛేంజ్​ బోనస్​, రూ. 10వేల అడిషనల్​ ఎక్స్​ఛేంజ్​ బోనస్​, రూ. 4వేల వరకు కార్పొరేట్​ డిస్కౌంట్​, రూ. 5వేల వరకు స్క్రాపేజ్​ డిస్కౌంట్​ వస్తున్నాయి. ఇది రూ. 49,500 డిస్కౌంట్​.

మారుతీ సుజుకీ ఇగ్నీస్​ ఎక్స్​షోరూం ధర రూ. 5.84లక్షలు- రూ. 8.16లక్షల మధ్యలో ఉంటుంది.

ఇదీ చూడండి:- Discounts on Hyundai cars : హ్యుందాయ్​ వాహనాలపై రూ. 2లక్షల వరకు డిస్కౌంట్లు..!

మారుతీ సుజుకీ బలెనో..

ఈ మోడల్​పై రూ. 20వేల క్యాష్​ డిస్కౌంట్​, రూ. 10వేల ఎక్స్​ఛేంజ్​ బోనస్​, రూ. 10వేల అడిషనల్​ ఎక్స్​ఛేంజ్​ బోనస్​, రూ. 5వేల స్క్రాపేజ్​ డిస్కౌంట్​ లభిస్తున్నాయి. మొత్తం మీద రూ. 45వేల డిస్కౌంట్​ వస్తోంది.

Maruti Suzuki Baleno on road price Hyderabad : మార్కెట్​లో బలెనో ఎక్స్​షోరూం ధర రూ. 6.61లక్షలు- రూ. 9.88లక్షల మధ్యలో ఉంటుంది.

మారుతీ సుజుకీ సియాజ్​..

ఈ సెడాన్​ మోడల్​పై మొత్తం మీద రూ. 33వేల వరకు ఆఫర్స్​ ఉన్నాయి. అవి.. రూ. 25వేలు విలువ చేసే ఎక్స్​ఛేంజ్​ బోనస్​, రూ. 5వేల వరకు స్క్రాపేజ్​ డిస్కౌంట్​, రూ. 3వేల వరకు కార్పొరేట్​ డిస్కౌంట్​. మార్కెట్​లో ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 9.30లక్షల నుంచి రూ. 12.29లక్షల మధ్యలో ఉంటుంది.

Discounts on Maruti Suzuki Ciaz : గ్రాండ్​ విటారా, ఎక్స్​ఎల్​6 వంటి ప్రీమియం సెగ్మెంట్​ మోడల్స్​పై ఈసారి ఎలాంటి డిస్కౌంట్లను ప్రకటించలేదు మారుతీ సుజుకీ.

  • పైన చెప్పిన డిస్కౌంట్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. అందుకే సమీప డీలర్​షిప్​షోరూమ్​ను సందర్శించి, పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.

మారుతీ సుజుకీ క్యూ1 ఫలితాలు..

Maruti Suzuki Q1 results 2023 : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ.. ఎఫ్​వై24 క్యూ1 ఫలితాలను ఇటీవలే ప్రకటించింది. జూన్​తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ స్టాండెలోన్​ నెట్​ ప్రాఫిట్​ రూ. 2,485.1 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే ఇది 145శాతం (రూ. 1,012.8కోట్లు) అధికం! సేల్స్​ వాల్యూమ్​ వృద్ధిచెందడంతో పాటు చిప్​ కొరత తగ్గడం వంటి అంశాలు సంస్థకు కలిసివచ్చాయి. ఈ ఫలితాలు మార్కెట్​ అంచనాల కన్నా మించి ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం