ప్రపంచాన్ని సందర్శించడం ఒక ఉత్తేజకరమైన అనుభవం, కానీ ఊహించని పరిణామాలకు వాటికి సిద్ధంగా ఉండటం చాలా అవసరం. అనేక క్రెడిట్ కార్డులు బిల్ట్-ఇన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫీచర్లతో వస్తాయి. ఇవి వివిధ రకాల ప్రయాణ సంబంధిత సంఘటనల నుంచి మీకు ఆర్థిక రక్షణను అందిస్తాయి. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు! ట్రిప్ క్యాన్సిల్, ఆలస్యం నుంచి కోల్పోయిన లగేజీ- వైద్య అత్యవసర పరిస్థితుల వరకు.. క్రెడిట్ కార్డుల ట్రావెల్ ఇన్సూరెన్స్తో లభిస్తాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
క్రెడిట్ కార్డ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ప్రయాణ సమయంలో ఆర్థిక రక్షణను అందించే ఒక విలువైన బెనిఫిట్. ఈ బీమా ప్రయోజనాలు సాధారణంగా ట్రిప్ క్యాన్సిల్, అంతరాయాలు, కోల్పోయిన లేదా ఆలస్యం అయిన సామాను, వైద్య అత్యవసర పరిస్థితులుస అద్దె కారు బీమాతో సహా అనేక వాటిని కవర్ చేస్తాయి.
సంబంధిత కథనం