Petrol Quality Check : పెద్ద పెద్ద పరికరాలు అక్కర్లేదు.. ఈ పేపర్‌తో పెట్రోల్ కల్తీ జరిగిందో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు-check petrol quality in few minutes without any instrument know how to test ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Petrol Quality Check : పెద్ద పెద్ద పరికరాలు అక్కర్లేదు.. ఈ పేపర్‌తో పెట్రోల్ కల్తీ జరిగిందో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు

Petrol Quality Check : పెద్ద పెద్ద పరికరాలు అక్కర్లేదు.. ఈ పేపర్‌తో పెట్రోల్ కల్తీ జరిగిందో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు

Anand Sai HT Telugu
Oct 01, 2024 04:00 PM IST

Petrol Quality Check : పెట్రోల్ కల్తీ జరిగింది అనే పదం తరచూ వింటుంటాం. మీకు కూడా పెట్రోల్ కల్తీ జరిగినట్టుగా అనుమానం వస్తే ఈజీగా చెక్ చేయవచ్చు.

పెట్రోల్ క్వాలిటీ చెక్
పెట్రోల్ క్వాలిటీ చెక్

దేశంలోని ప్రతి నగరంలో పెట్రోల్ బంకుల సంఖ్య పెరిగింది. కిలోమీటరు పరిధిలో 3 నుంచి 4 పెట్రోల్ బంకులు దర్శనమిస్తున్నాయి. చాలా పెట్రోల్ బంకుల్లో ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ నాణ్యతపై కూడా చాలా మందికి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చాలా సార్లు కల్తీ పెట్రోల్ వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో పెట్రోల్ నాణ్యత గురించి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. కావాలనుకుంటే క్షణాల్లో పెట్రోల్ క్వాలిటీ తెలుసుకోవచ్చు.

పెట్రోల్ నాణ్యత కూడా మన వాహనానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పెట్రోల్ కల్తీ జరిగితే.. అది వాహనం పాడైపోవడానికి కారణమవుతుంది. దాని ఇంజిన్ లేదా ఇతర భాగాలలో సమస్యను సృష్టిస్తుంది. మనం లైట్ తీసుకుంటే మన జేబుపై భారం పడుతుంది. అందుకే పెట్రోల్ క్వాలిటీని చెక్ చేయవచ్చు. ఇందుకోసం మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అడిగే హక్కు వినియోగదారుడికి ఉంది.

పెట్రోల్ నాణ్యతను తెలుసుకోవడానికి సులభమైన, చౌకైన మార్గం ఫిల్టర్ పేపర్. దీని వాడకంతో పెట్రోల్‌లో ఎలాంటి కల్తీ జరిగినా సులభంగా గుర్తించవచ్చు. పెట్రోల్ స్వచ్ఛతను తనిఖీ చేయడానికి ఫిల్టర్ కాగితంపై కొన్ని చుక్కల పెట్రోల్ వేయండి. ఫిల్టర్ పేపర్‌పై మరకలు పడితే పెట్రోల్ కల్తీ అయిందని అర్థం చేసుకోవాలి. మరకలు లేకపోతే పెట్రోల్ నాణ్యత బాగుందని అనుకోవాలి. పెట్రోలు స్వచ్ఛంగా ఉంటే కాగితంపై మరక పడకుండా క్షణాల్లోనే ఆవిరైపోతుంది. పెట్రోలు కల్తీ అయితే కాగితంపై డార్క్ పిగ్మెంట్‌లాంటిది మిగులుతుంది.

ఫిల్టర్ పేపర్ లేకపోతే వైట్ ఏ4 పేపర్‌తో కూడా చెక్ చేసుకోవచ్చు. A4 పేపర్ ధర 1 రూపాయి వరకు ఉంటుంది. అదే సమయంలో ఫిల్టర్ పేపర్ ఖరీదు 10లోపే ఉంటుంది. ఇలా క్వాలిటీ చెక్ చేసేందుకు మీకు కొద్దిగా ఫిల్టర్ పేపర్ మాత్రమే అవసరం పడుతుంది.

స్వచ్ఛమైన పెట్రోల్ సాంద్రత 730 నుంచి 800 మధ్య ఉంటుంది. పెట్రోల్ సాంద్రత 800 కంటే ఎక్కువగా ఉంటే పెట్రోల్ కల్తీ జరిగిందని స్పష్టమవుతోంది. అయితే దాని సాంద్రతను ప్రయోగశాలలో మాత్రమే పరీక్షిస్తారు. దీనికి కొన్ని ప్రత్యేక పరికరాలు అవసరం అవుతాయి. అదే మీకు ఈజీగా అందుబాటులో ఉండే పరీక్ష అంటే వైట్ పేపర్ మీద చెక్ చేసుకోవచ్చు. ఫిల్టర్ పేపర్స్ అనేవి బంకుల్లో కూడా ఇస్తారు. నాణ్యత టెస్ట్ కోసం మీరు అడగవచ్చు.

Whats_app_banner