Safest SUVs in India : ధర చూస్తే సరిపోదు.. ఫ్యామిలీ 'సేఫ్టీ' కూడా ముఖ్యం- ఈ ఎస్​యూవీలకు 5 స్టార్​ రేటింగ్​-check out these indias safest suvs with five star safety rating ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Safest Suvs In India : ధర చూస్తే సరిపోదు.. ఫ్యామిలీ 'సేఫ్టీ' కూడా ముఖ్యం- ఈ ఎస్​యూవీలకు 5 స్టార్​ రేటింగ్​

Safest SUVs in India : ధర చూస్తే సరిపోదు.. ఫ్యామిలీ 'సేఫ్టీ' కూడా ముఖ్యం- ఈ ఎస్​యూవీలకు 5 స్టార్​ రేటింగ్​

Sharath Chitturi HT Telugu
Oct 08, 2024 07:05 AM IST

Safest SUVs in 2024 : కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో 5 స్టార్​ రేటింగ్​తో వస్తున్న టాప్​ ఎస్​యూవీల లిస్ట్​ని ఇక్కడ తెలుసుకోండి..

ఈ ఎస్​యూవీలకు 5 స్టార్​ రేటింగ్​..
ఈ ఎస్​యూవీలకు 5 స్టార్​ రేటింగ్​..

పండగ సీజన్​లో దాదాపు అన్ని ఆటోమొబైల్​ సంస్థలు తమ ప్రాడక్ట్స్​పై భారీ డిస్కౌంట్లను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది కొత్త వాహనం కొనేందుకు వెళుతున్నాయి. అయితే వాహనం కొనేందుకు ధర ఒక్కటే ప్రామాణికం కాదని గుర్తుపెట్టుకోవాలి. కుటుంబం సేఫ్​గా ఉండాలంటే.. సంబంధిత కారు సేఫ్టీ రేటింగ్​ కూడా చూడాలి. ఈ నేపథ్యంలో భారత దేశంలో 5 స్టార్​ రేటింగ్​తో అందుబటులో ఉన్న కొన్ని ఎస్​యూవీల లిస్ట్​ని ఇక్కడ తెలుసుకోండి..

5 స్టార్​ రేటింగ్​ పొందిన ఎస్​యూవీల లిస్ట్​..

టాటా నెక్సాన్​

గ్లోబల్ ఎన్​సీఏపీ క్రాష్ టెస్ట్​లను రెండుసార్లు ఎదుర్కొని, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్​ పొందిన ఏకైక ఎస్​యూవీ టాటా నెక్సాన్. అత్యధిక భద్రతా రేటింగ్​ను ఈ ఎస్​యూవీ పొందింది. మారుతీ బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచిన ఈ సబ్ కాంపాక్ట్ ఎస్​యూవీ అడల్ట్ ప్రొటెక్షన్ లో 34 పాయింట్లకు గాను 32.22 పాయింట్లు, చైల్డ్ ప్రొటెక్షన్​లో 49కి 44.52 పాయింట్లు సాధించింది. ఈ ఎస్​యూవీలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ మౌంట్స్, రేర్ పార్కింగ్ సెన్సార్లు, టిల్ట్ అండ్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా హారియర్..

భారత్ ఎన్​సీఏపీ క్రాష్ టెస్ట్ చేయించుకున్న మొదటి ఎస్​యూవీ టాటా హారియర్ ఫేస్​లిఫ్ట్​. ఆరు ఎయిర్ బ్యాగులను స్టాండర్డ్​గా కలిగి ఉండి, మెరుగైన భద్రతా ఫీచర్లతో ఇది గత సంవత్సరం లాంచ్ అయ్యింది. టాప్-ఎండ్ వేరియంట్లలో ఏడు ఎయిర్ బ్యాగుల వరకు వస్తున్నాయి. ఇతర భద్రతా ఫీచర్లతో పాటు డ్రైవర్లకు సహాయపడటానికి ఏడీఏఎస్ టెక్నాలజీని కూడా ఇందులో ఉంది. హారియర్ బాడీషెల్ ఇంటిగ్రిటీ స్థిరంగా ఉందని గ్లోబల్ ఎన్​సీఏపీ పేర్కొంది. పాదచారుల రక్షణ కోసం యూఎన్ 127, జీటీఆర్ 9 అవసరాలను కూడా ఈ ఎస్​యూవీ ప్రామాణికంగా తీర్చింది. అడల్ట్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్​లో ఈ ఎస్​యూవీ 34 పాయింట్లకు గాను 33.05 పాయింట్లు, చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్​లో 49కి 45 పాయింట్లు సాధించింది. ఎస్​యూవీ మొత్తం భద్రతా స్కోరు 78.05 పాయింట్లు.

టాటా సఫారీ..

హారియర్ ఫేస్​లిఫ్ట్​తో పాటు లాంచ్ చేసిన కొత్త సఫారీ కూడా భారత్ ఎన్​సీఏపీ పరీక్షకు వెళ్లింది. ఈ ఎస్​యూవీలోనూ చాలా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఊహించినట్లుగానే, ఈ ఎస్​యూవీ హారియర్ మాదిరిగానే పాయింట్లు, సేఫ్టీ ర్యాంకింగ్​తో తిరిగి వచ్చింది. రూ.16.19 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ అయిన ఈ మూడు వరుసల ఎస్​యూవీలో ఏబీఎస్ విత్ ఈబీడీ, ఈఎస్​పీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, డ్రైవర్ అటెన్షన్ అలర్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఎమర్జెన్సీ కాల్, బ్రేక్ డౌన్ అలర్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

టాటా పంచ్..

టాటా మోటార్స్​కి చెందిన అతిచిన్న ఎస్​యూవీ పంచ్​ కూడా భారతదేశంలో సురక్షితమైన ఎస్​యూవీల జాబితాలో ఉంది. గ్లోబల్ ఎన్​సీఏపీలో ఓవరాల్ ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించి పంచ్ అందరిని ఆశ్చర్యపరిచింది. అడల్ట్ లేదా చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ విషయానికి వస్తే సేఫ్టీ రేటింగ్స్ ఎక్స్​యూవీ700 మాదిరిగానే ఉండటం విశేషం. అయితే పంచ్ మొత్తం సేఫ్టీ స్కోర్ 57.34 పాయింట్లుగా ఉంది.

వోక్స్​వ్యాగన్ టైగన్..

జర్మన్ ఆటో దిగ్గజం నుంచి వచ్చిన టైగన్ కాంపాక్ట్ ఎస్​యూవీ కూడా భారతదేశంలోని సురక్షితమైన ఎస్​యూవీల్లో ఒకటి. గత ఏడాది జరిగిన గ్లోబల్ ఎన్​సీఏపీ క్రాష్ టెస్ట్​లో వయోజన, పిల్లల రక్షణ చర్యల్లో పర్ఫెక్ట్ 5 మార్కులు సాధించింది. మొత్తం సేఫ్టీ స్కోర్ 71.64 పాయింట్లుగా ఉంది.

స్కోడా కుషాక్​..

వోక్స్​వ్యాగన్ టైగన్ సాంకేతిక సిబ్లింగ్​ అయిన స్కోడా కుషాక్ కాంపాక్ట్ ఎస్​యూవీ సైతం గ్లోబల్ ఎన్​సీఏపీ క్రాష్ టెస్ట్​లలో ఇదే భద్రతా రేటింగ్ పొందింది. అడల్ట్, చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ రెండింటిలోనూ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది.

మహీంద్రా స్కార్పియో-ఎన్..

మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి వచ్చిన ఫ్లాగ్​షిప్ స్కార్పియో ఎస్​యూవీ కొత్త తరం వెర్షన్ అయిన స్కార్పియో-ఎన్ ఎస్​యూవీ ప్రస్తుతం భారతదేశంలోని సురక్షితమైన ఎస్​యూవీల్లో ఒకటి. గ్లోబల్ ఎన్​సీఏపీ క్రాష్ టెస్ట్​లో ఇది 58.18 పాయింట్లు సాధించింది. వయోజన ప్రయాణీకుల రక్షణలో ఫైవ్ స్టార్ రేటింగ్​ను పొందింది. కానీ పిల్లల రక్షణలో కేవలం 3 స్టార్ పాయింట్లను మాత్రమే సాధించింది. ఇది అధికారికంగా భారతీయ కార్ల తయారీదారుల నుంచి సురక్షితమైన ఎస్​యూవీ.

మహీంద్రా ఎక్స్​యూవీ700..

మహీంద్రా ఫ్లాగ్​షిప్ ఎక్స్​యూవీ 700 ఎస్​యూవీ ఇంతకుముందు అత్యంత సురక్షితమైన కారుగా ఉండేది. ఎక్స్​యూవీ 700 అడల్ట్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్, ఫోర్ స్టార్ రేటింగ్ చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్​లో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది. అయితే మొత్తం సేఫ్టీ స్కోర్ 57.69 పాయింట్లు కాగా, స్కార్పియో-ఎన్ కంటే కాస్త తక్కువగా ఉంది.

మహీంద్రా ఎక్స్​యూవీ300..

గ్లోబల్ ఎన్​సీఏపీలో మొత్తం ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన మూడవ మహీంద్రా ఎస్​యూవీ ఈ ఎక్స్​యూవీ300. ఇది అడల్ట్​ రక్షణలో 5 స్టార్​ సాధించగా, చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ రేటింగ్ నాలుగు స్టార్లుగా ఉంది. ఎక్స్​యూవీ 300 మొత్తం భద్రతా స్కోరు 53.86 పాయింట్లు.

Whats_app_banner

సంబంధిత కథనం