Maruti Suzuki Fronx on road price : ఇండియాలో ఫిబ్రవరి నెలలో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో ఒకటిగా నిలిచింది మారుతీ సుజుకీ ఫ్రాంక్స్. ఫిబ్రవరి ఒక్క నెలలోనే 14,167 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ ఎస్‌యూవీకి మంచి డిమాండ్ కనిపిస్తోంది. మరి.. మీరు కూడా ఒక కొత్త ఎస్యూవీ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ మీ లిస్ట్‌లో ఉందా? అయితే ఇది మీకోసమే.. హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి. మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది.
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ సిగ్మా:- రూ. 8,97,500
ఫ్రాంక్స్ డెల్టా:- రూ. 9.8 లక్షలు
సిగ్మా సీఎన్జీ:- రూ. 10.09 లక్షలు
డెల్టా ప్లస్:- రూ. 10.45 లక్షలు
డెల్టా ఏఎంటీ:- రూ. 10.57 లక్షలు
డెల్టా ప్లస్ ఏఎంటీ:- రూ. 11.04 లక్షలు
డెల్టా సీఎన్జీ:- రూ. 11.10 లక్షలు
డెల్టా ప్లస్ టర్బో:- రూ. 11.51 లక్షలు
జీటా టర్బో:- రూ. 12.90 లక్షలు
Maruti Suzuki Fronx on road price in Hyderabad : ఆల్ఫా టర్బో:- రూ. 14.06 లక్షలు
ఆల్ఫా టర్బో డీటీ:- రూ. 14.27 లక్షలు
జీటా టర్బో ఏటీ:- రూ. 14.60 లక్షలు
ఆల్ఫా టర్బో ఏటీ:- రూ. 15.72 లక్షలు
ఆల్ఫా టర్బో డీటీ ఏటీ:- రూ. 20.78లక్షలు
అంటే.. హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 8.9లక్షలు- రూ. 20.78లక్షలో మధ్యలో ఉంటుంది. కాగా.. పైన చెప్పిన సీఎన్జీని మినహాయిస్తే.. మిగిలినవన్నీ పెట్రోల్, టర్పో పెట్రోల్ వేరియంట్లే! మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌లో డీజిల్ మోడల్స్ లేవు.
ఇక మారుతీ సుజికీ ఫ్రాంక్స్‌లో డెల్ట్ ప్లస్, డెల్టా సీఎన్జీ వేరియంట్లు.. బెస్ట్ సెల్లింగ్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.
Maruti Suzuki Fronx price : సాధారణంగా.. ఏదైనా వెహికిల్‌ని లాంచ్ చేసేడప్పుడు.. దాని ఆన్‌రోడ్ ప్రైజ్‌ని మాత్రమే చెబుతుంది సంస్థ. కానీ డీలర్షిప్షోరూమ్స్లో వాస్తవ ధర అధికంగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువరుగా ఉండటమే ఇందుకు కారణం. అందుకే.. వెహికిల్‌ని కొనేముందు ఎక్స్‌షోరూం ప్రైజ్‌ని చూడకుండా.. ఆన్‌రోడ్ ప్రైజ్ ఆధారంగా బడ్జెట్‌ని ప్లాన్ చేసుకోవడం బెటర్. అప్పుడే.. ఓ క్లారిటీ వస్తుంది.
సంబంధిత కథనం