Cheapest Bikes : ఎక్కువ మంది ఇష్టపడే తక్కువ ధరలోని బైక్స్.. 75 వేలలోపు ధర, 70 కి.మీ మైలేజీ!-cheapest bikes with good mileage in india under 75000 rupees hero hf 100 to honda cd 110 check list here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Cheapest Bikes : ఎక్కువ మంది ఇష్టపడే తక్కువ ధరలోని బైక్స్.. 75 వేలలోపు ధర, 70 కి.మీ మైలేజీ!

Cheapest Bikes : ఎక్కువ మంది ఇష్టపడే తక్కువ ధరలోని బైక్స్.. 75 వేలలోపు ధర, 70 కి.మీ మైలేజీ!

Anand Sai HT Telugu
Oct 24, 2024 05:44 AM IST

Cheapest Bikes : మిడిల్ క్లాస్ వాళ్లు ఎక్కువగా చూసేది తక్కువ ధరలోని బైక్స్ కోసం. వీటి మైలేజీ కూడా బాగుంటుంది. ధర తక్కువ, మైలేజీ ఎక్కువ ఉన్న బైక్స్ ఏంటో చూద్దాం..

తక్కువ ధరలోని బైక్స్
తక్కువ ధరలోని బైక్స్

భారత మార్కెట్‌లో తక్కువ ధరతో దొరికే బైక్స్ చాలానే ఉన్నాయి. మైలేజీ పరంగా కూడా ముందు ఉంటాయి. డిజైన్ కూడా బాగుంటుంది. మధ్యతరగతివారికి ఈ బైక్స్ చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి ధర తక్కువ ఉండటమే కాదు.. మైలేజీపరంగా అద్భుతంగా ఉంటాయి. డైలీ వాడకానికి ఈ బైక్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఎలాంటి బైక్ తీసుకోవాలి అనుకునేవారి కోసం కొన్ని ఐడియాలు ఉన్నాయి. తక్కువ ధరలో ఏ బైక్స్ బెటర్ అని చూద్దాం..

హీరో హెచ్‌ఎఫ్ 100 మోటార్‌సైకిల్ ధర రూ.49,999 ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇది 8.02 పీఎస్ హార్స్ పవర్, 8.05 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని విడుదల చేసే 97.2 సీసీ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. 4-గేర్‌బాక్స్ కూడా ఉంది. కొత్త హీరో హెచ్ఎఫ్ 100 బైక్ 70 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది. అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా వివిధ ఫీచర్‌లతో వస్తుంది. దీని బరువు 109 కిలోలు, రెడ్-బ్లాక్, బ్లూ-బ్లాక్ అనే రెండు ఆప్షన్లలో లభిస్తుంది. సేఫ్టీ పరంగా చూసుకుంటే డ్రమ్ బ్రేక్‌లతో వస్తుంది.

టీవీఎస్ స్పోర్ట్ కూడా ఒక మంచి బైక్. దీని ధర రూ. 67,320 నుండి రూ. 72,033 ఎక్స్-షోరూమ్‌గా ఉంది. 109.7 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో దొరుకుతుంది. ఇది 8.19 పీఎస్ హార్స్ పవర్, 8.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-గేర్‌బాక్స్‌తో వస్తుంది. గరిష్టంగా 90 కేఎంపీహెచ్ వేగంతో వెళ్తుంది. ఇది 70 కేఎంపీఎల్ వరకు మైలేజీని ఇస్తుంది. ఇది అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌తో సహా పలు ఫీచర్లతో ఉంటుంది. 10 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. ఇది ప్రయాణికుల సేఫ్టీ కోసం డ్రమ్ బ్రేక్‌లను పొందుతుంది.

బజాజ్ సిటీ 110ఎక్స్ బైక్ ధర రూ.69,217 ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇందులో 115.45 సిసి ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 8.6 పీఎస్ హార్స్ పవర్, 9.81 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ 70 కిలో మీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. గరిష్టంగా 90 కేఎంపీహెచ్ వేగంతో వెళ్తుంది. మాట్ వైల్డ్ గ్రీన్, ఎబోనీ బ్లాక్-రెడ్‌తో సహా వివిధ రంగులలో దొరుకుతుంది. అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. సేఫ్టీ కోసం దీనికి డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.

హోండా సిడి 110 డ్రీమ్ రూ.73,400 ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది 8.79 PS హార్స్ పవర్, 9.30 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 109.51 సీసీఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ 65 కిలో మీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. ఏసీజీ స్టార్టర్ మోటార్ సిస్టమ్‌తో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది 112 కిలోల బరువు, 9.1 లీటర్ కెపాసిటి గల ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది. సేఫ్టీ కోసం డ్రమ్ బ్రేక్‌లు వస్తాయి.

Whats_app_banner

సంబంధిత కథనం