Maruti Suzuki : 6.49 లక్షలకే మారుతి కొత్త కారు.. 25 కిలోమీటర్ల మైలేజీ..!-maruti suzuki swift blitz edition launched at 6 49 lakhs with 25km mileage ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki : 6.49 లక్షలకే మారుతి కొత్త కారు.. 25 కిలోమీటర్ల మైలేజీ..!

Maruti Suzuki : 6.49 లక్షలకే మారుతి కొత్త కారు.. 25 కిలోమీటర్ల మైలేజీ..!

Anand Sai HT Telugu
Oct 17, 2024 01:15 PM IST

Maruti Suzuki Swift Blitz : భారత్‌లో మారుతి కార్లకు మంచి డిమాండ్ ఉంది. కొత్తగా మారుతి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం..

మారుతి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్‌ లాంచ్
మారుతి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్‌ లాంచ్

మారుతి సుజుకి కొత్త ఎడిషన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. దీంతోపాటుగా కొన్ని యాక్సెసరీలు ఫ్రీగా వస్తాయి. పండుగ సీజన్‌లో భాగంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ ప్రయత్నం చేస్తోంది. మారుతి స్విఫ్ట్ అమ్మకాలను పెంచడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. కొన్ని రోజుల్లోనే బాలెనో రీగల్ ఎడిషన్, వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ ఎడిషన్, గ్రాండ్ విటారా డొమినియన్ ఎడిషన్, ఇగ్నిస్ రేడియన్స్ ఎడిషన్‌లను లాంచ్ చేసింది. తాజాగా స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్‌ను కూడా తీసుకొచ్చింది.

స్విఫ్ట్ బ్లిట్జ్ ఐదో ప్రత్యేక ఎడిషన్‌గా చెప్పవచ్చు. మారుతి సుజుకి స్విఫ్ట్ బ్లిట్జ్ అమ్మకాలను పెంచడానికి డీలర్‌లు పరిమిత కాలానికి విక్రయిస్తారు. స్విఫ్ట్ బ్లిట్జ్ స్పెషల్ ఎడిషన్ కొనుగోలు చేసిన వారికి రూ. 49,848 విలువైన యాక్సెసరీ కిట్‌ను ఉచితంగా పొందుతారు. ఈ ప్రత్యేక స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ LXI, VXI (O), VXI, VXI AMT, VXI (O) AMT అనే ఐదు వేరియంట్‌లలో ఉంటుంది.

ఈ అన్ని వేరియంట్‌లలో స్టాండర్డ్ ఫీచర్‌లతో పాటుగా రియర్ అండర్‌బాడీ స్పాయిలర్, షైనింగ్ డోర్ సిల్స్, డోర్ వైజర్స్, బూట్ పైన స్పాయిలర్, ఫాగ్ ల్యాంప్స్, సైడ్ మోల్డింగ్ యాక్సెసరీలు ఉచితంగా లభిస్తాయి. దీని ధర రూ. 6.49 లక్షల నుంచి 8.02 లక్షల వరకు ఎక్స్‌ షోరూమ్‌గా ఉంటుంది. ఇంజిన్, పనితీరులో ఎటువంటి మార్పు ఉండదు.

స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ అదే జెడ్-సిరీస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 80.46 బిహెచ్‌పీ పవర్, 111.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ యూనిట్ అందిస్తుంది. ఇది మాన్యువల్‌లో 24.80 కిమీ, ఆటోమేటిక్‌లో 25.75 కిమీ మైలేజీని ఇస్తుంది.

సేఫ్టీ కోసం, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్‌తో సహా పలు భద్రతా ఫీచర్లు వస్తాయి.

Whats_app_banner