Chakshu portal : స్పామ్​ కాల్స్​- మెసేజ్​లతో విసిగెత్తిపోయారా? ఇక్కడ ఫిర్యాదు చేయండి..-chakshu portal tired of spam calls and messages checkout this new government initiation ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Chakshu Portal : స్పామ్​ కాల్స్​- మెసేజ్​లతో విసిగెత్తిపోయారా? ఇక్కడ ఫిర్యాదు చేయండి..

Chakshu portal : స్పామ్​ కాల్స్​- మెసేజ్​లతో విసిగెత్తిపోయారా? ఇక్కడ ఫిర్యాదు చేయండి..

Sharath Chitturi HT Telugu
Mar 12, 2024 11:06 AM IST

How to report in Chakshu portal : స్పామ్​ కాల్స్​- మెసేజ్​లను ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం ఓ కొత్త పోర్టల్​ని లాంచ్​ చేసింది. దీని పేరు చక్షు పోర్టల్​. ఈ పోర్టల్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

చక్షు ప్రభుత్వ పోర్టల్​ గురించి మీకు తెలుసా?
చక్షు ప్రభుత్వ పోర్టల్​ గురించి మీకు తెలుసా?

Chakshu portal to report spam calls : స్పామ్​ కాల్స్​, జంక్​ మెసేజ్​లు, ఫ్రాండ్​ మెసేజ్​లతో విసిగెత్తి పోయారా? అయితే.. మీకోసం.. ప్రభుత్వం ఓ కొత్త పోర్టల్​ని తీసుకొచ్చింది. దీని పేరు చక్షు పోర్టల్​. అనుమానిత ఫ్రాడ్​ కాల్స్​, మెసేజ్​లను ఇందులో రిపోర్టు చేయవచ్చు. గడిచిన 30 రోజుల్లో ఏదైనా స్పామ్​ కాల్​- మెసేజ్​ అందితే.. దానిని పోర్టల్​లో ఫిర్యాదు చేయవచ్చు.

చక్షు పోర్టల్​తో 'స్పామ్​'కు చెక్​..

టెలికాం వసతులను దుర్వినియోగం చేయకుండా చూసుకునేందుకు.. బ్యాంక్​లు, ఆర్థిక వ్యవస్థలు, దర్యాప్తు సంస్థలతో కోఆర్డినేట్​ చేసేందుకు డిజిటల్​ ఇంటెలిజెన్స్​ ప్లాట్​ఫామ్ (డీఐపీ)​ని లాంచ్​ చేసింది భారత ప్రభుత్వం. ఈ విషయంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి అశ్విణి వైష్ణవ్​.

"భారత ప్రజలు.. ఫ్రాడ్​ సమాచారాన్ని రిపోర్టు చేయవచ్చు. అది ఫోన్​ కాల్​ అయినా, ఎస్​ఎంఎస్​ అయినా, వాట్సాప్​ లాంటి సోషల్​ మీడియా యాప్స్​ అయినా పర్లేదు. ఫిర్యాదు అందిన తర్వాత.. డీఐపీ ప్లాట్​ఫామ్​.. రీ- వెరిపికేషన్​ ప్రక్రియను ప్రారంభిస్తుంది. రీ- వెరిఫికేషన్​లో తప్పులు బయటపడితే.. ఆ నెంబర్​ ఇక డిస్కంటిన్యూ అయిపోతుంది," అని తెలిపారు అశ్విణి వైష్ణవ్​.

చక్షు పోర్టల్​లో స్పామ్​ కాల్స్​- మెసేజ్​లను ఎలా రిపోర్ట్​ చేయాలి?

How to report in chakshu portal in Telugu : సంచార్​ సాతి వెబ్​సైట్​లో.. ఈ చక్షు పోర్టల్​ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా కాల్స్​, ఎస్​ఎంఎస్​, వాట్సాప్​లో అంది ఫ్రాడ్​ కమ్యూనికేషన్​ని రిపోర్ట్​ చేయవచ్చు.

"సెక్స్​టార్షన్​ కేసులకు ఈ పోర్టల్​ బాగా ఉపయోగపడుతుంది. కొందరు.. ప్రభుత్వ అధికారులం అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంక్​ వివరాలను అడుగుతున్నారు. అలాంటి కేసులను కూడా ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు," అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

స్టెప్​ 1:- sancharsaathi.gov.in వెబ్​సైట్​లోకి వెళ్లండి. కిందకి స్క్రోల్​ చేసి సిటిజెన్​ సెంట్రిక్​ సర్వీసెస్​పై క్లిక్​ చేయండి.

స్టెప్​ 2:- చక్షు పోర్టల్​ ఆప్షన్​ని ఎంచుకోండి. ఫ్రాడ్​ కాల్​, మెసేజ్​లను ఫిర్యాదు చేసేందుకు కంటిన్యూ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 3:- సంబంధిత కాల్​, మెసేజ్​ డేటాను షేర్​ చేయాలని మీకు కనిపిస్తుంది.

chakshu portal latest news : స్టెప్​ 4:- ఫ్రాడ్​ కేటగిరీని సెలక్ట్​ చేసుకోండి. సంబంధిత స్క్రీన్​షాట్​ని అప్లోడ్​ చేయండి.

స్టెప్​ 5:- ఫ్రాడ్​కు పాల్పడిన అనుమానిత మొబైల్​ నెంబర్​, డేట్​- టైమ్​ వంటి వివరాలను ఎంటర్​ చేయాల్సి ఉంటుంది.

స్టెప్​ 6:- మీ పూర్తి పేరు, డేట్​ ఆఫ్​ బర్త్​, ఫోన్​ నెంబర్​, ఓటీపీ వంటి వివరాలను ఫిల్​ చేయాలి. ఆ తర్వాత.. మీ కంప్లైంట్​ రిజిస్టర్​ అవుతుంది.

అనంతరం.. సంబంధిత నెంబర్​పై రీ- వెరిఫికేషన్​ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఈ ‘స్పామ్​’ సమస్య ఇటీవలి కాలంలో చాలా పెరిగిపోయింది. అందరికి ఇదొక తలనొప్పిగా మారిందనే చెప్పుకోవాలి. ప్రజలు చాలా మంది స్కామ్​కు గురవుతూ, చాలా డబ్బులు కోల్పోతున్నారు. అందుకే.. వీటిని చక్షు పోర్టల్​లో ఫిర్యాదు చేయడం బెటర్​!

సంబంధిత కథనం