Rythu Bandhu Updates : రైతు బంధుపై అప్ డేట్- 5 ఎకరాల్లోపు వారికి డబ్బులు, కొండలు, గుట్టలకు కట్
- Rythu Bandhu Updates : రైతు బంధు పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ రైతు బంధు డబ్బులను(Rythu Bandhu Scheme) ఐదు నెలలపాటు రైతుల ఖాతాల్లో వేసిందన్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వారి కంటే తక్కువ సమయంలోనే రైతు బంధు సాయాన్ని అందజేస్తున్నామన్నారు.
- Rythu Bandhu Updates : రైతు బంధు పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ రైతు బంధు డబ్బులను(Rythu Bandhu Scheme) ఐదు నెలలపాటు రైతుల ఖాతాల్లో వేసిందన్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వారి కంటే తక్కువ సమయంలోనే రైతు బంధు సాయాన్ని అందజేస్తున్నామన్నారు.
(1 / 6)
రైతు బంధు పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ రైతు బంధు డబ్బులను(Rythu Bandhu Scheme) ఐదు నెలలపాటు రైతుల ఖాతాల్లో వేసిందన్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వారి కంటే తక్కువ సమయంలోనే రైతు బంధు సాయాన్ని అందజేస్తున్నామన్నారు.
(2 / 6)
కొండలు, గుట్టలు, రోడ్లకు రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ప్రస్తుతం పాత డేటా ప్రకారమే రైతు బంధు ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం 4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు(Rythu Bandhu Updates) ఇస్తున్నామన్నారు. త్వరలో 5 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇస్తామన్నారు. (Pixabay)
(3 / 6)
వ్యవసాయం చేసే వారికే రైతుబంధు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ పంపులకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇంకా ఎవరైనా రైతులకు రైతుబంధు అందకుంటే ఈ నెలఖారులోపు కంప్లీట్ అందిస్తామన్నారు. (Pixabay)
(4 / 6)
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాదికి రెండు సార్లు రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు బంధు పథకాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. ఖరీఫ్, రబీ పంటలకు ఏడాదికి ఎకారాకు రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో వేసేది. అయితే భూమికి ఎలాంటి పరిమితి లేదు. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రూ. 5 వేల చొప్పున ఏడాది రెండు సార్లు ఆర్థిక సాయం వచ్చేది. అయితే వందల ఎకరాలు ఉన్నవారికి కూడా రైతు బంధు ఇవ్వడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి.
(5 / 6)
తెలంగాణ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధుపై పరిమితులు విధించింది. వందల ఎకరాలు ఉన్నవారికి రైతు బంధు సాయం కట్ చేసింది. ప్రస్తుతానికి 4 ఎకరాలు ఉన్న వారికి మాత్రమే సాయం అందించారు. త్వరలో 5 ఎకరాల వారికి రైతు బంధు వేస్తామన్నారు. మ్యాగ్జిమమ్ 10 ఎకరాల లోపు వారికి మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం సూత్రప్రాయంగా ప్రకటించింది.
ఇతర గ్యాలరీలు