Business Idea : మెుక్కలు పెంచండి.. డబ్బులు సంపాదించండి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం-business idea bonsai tree farming grow plants earn money more profit with less investment ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Business Idea : మెుక్కలు పెంచండి.. డబ్బులు సంపాదించండి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం

Business Idea : మెుక్కలు పెంచండి.. డబ్బులు సంపాదించండి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం

Anand Sai HT Telugu
Nov 19, 2024 03:30 PM IST

Bonsai Tree Farming : కొందరికి చెట్లు పెంచడం హబీ. కానీ దీనినే మీరు బిజినెస్‌గా మార్చుకోవచ్చు. బోన్సాయ్ మెుక్కలు పెంచడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. ఎందుకంటే దీనికి చాలా డిమాండ్ ఉంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

మెుక్కలు పెంచడం మీకు ఇష్టమైతే.. దీనితోనే బిజినెస్ ప్లాన్ చేయవచ్చు. మంచి లాభాలు కూడా పొందవచ్చు. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తక్కువ సమయంలో మంచి లాభాలను పొందే వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. మీరు కూడా అలాంటి వ్యాపారం కోసం ప్లాన్ చేస్తుంటే మంచి ఆప్షన్ ఉంది. ఇది ప్రారంభించడం ద్వారా మీరు ఎల్లప్పుడూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. మీకు ఆరోగ్యపరంగానూ ఉపయోగపడుతుంది. బోన్సాయ్ చెట్టు గురించి మీరు వినే ఉంటారు. ఈ వ్యాపారంతో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించొచ్చు.

మీరు ఈ మెుక్కను పెంచాలని ఆలోచిస్తుంటే.. భారత ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం అందజేస్తుంది. దాని సహాయంతో మీరు దీన్ని బాగా పెంచవచ్చు. మీరు గుర్తుంచుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే, దీనిని పెంచేటప్పుడు పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ చెట్టును నాటడం ద్వారా మీ ఇంటి వాతావరణం కూడా చల్లగా ఉంటుంది.

దీన్ని పెంచడానికి మీరు ఎక్కడికీ వెళ్లనవసరం లేదు. ఇంట్లో కూర్చొని మంచి లాభాలను పొందవచ్చు. అదే సమయంలో బోన్సాయ్ మెుక్కకు మార్కెట్‌లో డిమాండ్ చాలా పెరుగుతోంది. ఎందుకంటే ప్రజలు ప్రత్యేక ఫంక్షన్లలో ఈ చెట్టుతో తమ ఇళ్లను చాలా అలంకరిస్తారు. మంచి గాలి కోసం చాలా మంది ఇంట్లోనూ దీనిని పెట్టుకుంటున్నారు.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఏదైనా స్థలంలో దీన్ని సులభంగా సెటప్ చేసుకోవచ్చు. ఈ వ్యాపారాన్ని చాలా సులభంగా ప్రారంభించవచ్చు. కానీ సంపాదించడానికి కొంత ఓపిక ఉండాలి. బోన్సాయ్ చెట్టు సిద్ధం అవ్వడానికి కనీసం రెండు సంవత్సరాలు నుంచి ఐదు సంవత్సరాలు పడుతుంది. అయితే అది సిద్ధంగా ఉన్నప్పుడు మీకు విపరీతమైన లాభాలను కూడా అందిస్తాయి. బోన్సాయ్ మెుక్కలు సమీపంలోని నర్సరీలలో లభిస్తాయి. వాటిని నాటవచ్చు, పెరిగిన తర్వాత మీరు మార్కెట్లో విక్రయించి డబ్బు సంపాదించవచ్చు. ఈ వ్యాపారాన్ని రూ. 15000 నుండి 20000 పెట్టుబడితో మెుదలుపెట్టాలి. మెల్లగా వ్యాపారాన్ని క్రమంగా విస్తరించవచ్చు.

ఈ రోజుల్లో బోన్సాయ్‌కి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే.. ఇళ్లలో వివాహాలు, పుట్టినరోజుల వంటి సందర్భాలలో అలంకరణ కోసం వాడుతారు. ఆరోగ్యపరంగానూ దీని ద్వారా మేలు జరుగుతుంది. మార్కెట్‌లో ఈ చెట్టు ధర రూ. 200 నుంచి రూ. 2000 వరకు పలుకుతోంది. కొన్ని రకాల ధరలు పదివేలపైనే ఉన్నాయి. ఇంత ఎక్కువ ధర ఉన్నప్పటికీ కొనుగోలు చేసేవారు చాలా మంది ఉన్నారు. భారత ప్రభుత్వం ఇలాంటి అనేక వ్యాపారాలకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. తద్వారా ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి చింత లేకుండా మంచి లాభాలు పొందవచ్చు.

గమనిక : వ్యాపారానికి సంబంధించి ఐడియా మాత్రమే ఇస్తున్నాం. పెట్టుబడి, ఇతర విషయాలను మీరు పూర్తిగా తెలుసుకోవడం మంచిది.

Whats_app_banner