Small Business Idea : ఈ వ్యాపారాన్ని తక్కువ డబ్బుతో ప్రారంభించొచ్చు.. ప్రతి నెలా మంచి ఆదాయం-small business idea you can start this business with less money get good income every month ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Small Business Idea : ఈ వ్యాపారాన్ని తక్కువ డబ్బుతో ప్రారంభించొచ్చు.. ప్రతి నెలా మంచి ఆదాయం

Small Business Idea : ఈ వ్యాపారాన్ని తక్కువ డబ్బుతో ప్రారంభించొచ్చు.. ప్రతి నెలా మంచి ఆదాయం

Anand Sai HT Telugu
Nov 11, 2024 02:00 PM IST

Small Business Idea In Telugu : వ్యాపారం చేయాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది. కానీ ఎలాంటి బిజినెస్ చేయాలో మాత్రం అర్థం కాదు. అలాంటి వారి కోసం చిన్న వ్యాపారం ఉంది. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

బిజినెస్ ఐడియా
బిజినెస్ ఐడియా (Unsplash)

ఈ మధ్య కాలంలో చాలా మంది ఉద్యోగాలు సైతం వదిలి.. వ్యాపారాల్లో దిగుతున్నారు. కానీ ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలో అర్థంకాక ఇబ్బంది పడుతున్నారు. కొందరు అధిక వ్యయం కారణంగా వ్యాపారాన్ని ప్రారంభించలేరు. మీరు తక్కువ ఖర్చుతో వ్యాపారం కోసం చూస్తున్నట్లయితే.. మీ కోసం మంచి ఆలోచన ఉంది. తక్కువ పెట్టుబడితో లాభాలను తెస్తుంది. మీరు ప్రతి నెలా అధిక మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు.

ఇప్పుడు చెప్పబోయే వ్యాపారం గురించి గ్రామాలు, నగరాల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. సో.. మీకు డిమాండ్ ఉండదేమోనని టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ వ్యాపారం ప్రతి నెలా భారీ ఆదాయాన్ని ఇస్తుంది. ఆ వ్యాపారం ఏదో కాదు.. టమోటా సాస్ వ్యాపారం. ఇటీవలి కాలంలో దీనిని ఎక్కువగా వాడుతున్నారు.

టొమాటో సాస్ చాలా పదార్థాల్లో కలిపి తింటారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎక్కువగా ఇష్టం ఇది. టొమాటో సాస్ కొన్ని వంటల్లో, పిజ్జా, బర్గర్లు, ఎగ్ పఫ్,‌ నూడుల్స్‌ లాంటి మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. మీకు ఏడాది పొడవునా టొమాటోలు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. అందువల్ల మీరు ముడి పదార్థాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ,

టొమాటో సాస్ చేయడానికి మీరు కొన్ని యంత్రాలు, సామగ్రిని కొనుగోలు చేయాలి. దీని ధర దాదాపు రూ. 2 లక్షలు వరకు ఉంటుంది. ఇది కాకుండా మీరు ముడి సరుకులు, కార్మికుల జీతం, ప్యాకింగ్, అద్దెకు కూడా ఏర్పాటు చేసుకోవాలి, దీనితో మొత్తం ఖర్చు రూ. 6 లక్షల వరకు అవుతుంది.

మీరు పచ్చి, పండిన టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసి, వాటిని ఆవిరి కెటిల్లో ఉడికించాలి. దీని తరువాత ఈ ఉడకబెట్టిన టమోటాల నుండి గుజ్జును తయారు తీయాలి. విత్తనాలు, పీచు పదార్థం వేరు చేయాలి. ఇందులో ఉప్పు, పంచదార, వెనిగర్, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, నల్ల మిరియాలు మొదలైనవి జోడించాలి. దీనితో పాటు అది పాడైపోకుండా కొన్ని రకాల కెమికల్స్ కలపాలి.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ వద్ద డబ్బు లేకపోతే.. ముద్రా పథకం కింద ఆర్థిక సహాయం తీసుకోవచ్చు. ప్రధాన మంత్రి ముద్రా పథకం కింద టమోటా సాస్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం నుండి లోన్ తీసుకోవచ్చు.

Whats_app_banner