Budget 2024 : ‘బడ్జెట్​’పై సామాన్యుడిలో భారీ ఆశలు.. నెరవేరేనా?-budget 2024 common man wishlist for fm sitharaman ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget 2024 : ‘బడ్జెట్​’పై సామాన్యుడిలో భారీ ఆశలు.. నెరవేరేనా?

Budget 2024 : ‘బడ్జెట్​’పై సామాన్యుడిలో భారీ ఆశలు.. నెరవేరేనా?

Sharath Chitturi HT Telugu
Jan 23, 2024 01:14 PM IST

Budget 2024 : మరికొన్ని రోజుల్లో 2024 బడ్జెట్​ని ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్​. ఈ నేపథ్యంలో నిపుణులు అభిప్రాయాలను ఇక్కడ తెలుసుకుందాము..

‘బడ్జెట్​’పై సామాన్యుడిలో భారీ ఆశలు.. నెరవేరేనా?
‘బడ్జెట్​’పై సామాన్యుడిలో భారీ ఆశలు.. నెరవేరేనా?

Budget 2024 : కేంద్ర బడ్జెట్ 2024కు ఇంకొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ ఆకాంక్షలను నెరవేరుస్తారని సామాన్య పౌరులు ఆశాభావంతో ఉన్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్​లో ఆర్థిక మంత్రి నుంచి సామాన్యుడు ఈసారి ఏం కోరుకుంటున్నాడో ఇక్కడ తెలుసుకుందాము..

సెక్షన్ 80సీ కింద లభించే మినహాయింపు పరిమితిలో సవరణ..

“ప్రస్తుతం సెక్షన్ 80 సీసీఈ ప్రకారం.. సెక్షన్ 80సీ, 80సీసీసీ, 80సీసీడీ(1) కింద లభించే మినహాయింపులు సంవత్సరానికి రూ .1.50 లక్షలకు పరిమితమయ్యాయి. 2014 నుంచి ఇదే కొనసాగుతోంది. వాస్తవానికి 2003 వరకు ఈ పరిమితి రూ. లక్షగా ఉండేది. రూ.లక్ష పరిమితిని నిర్ణయించి దాదాపు 18 ఏళ్లు అవుతోంది. ఇది 2014లో 50% మాత్రమే పెరిగింది. అంటే.. వార్షికంగా 3% కంటే తక్కువే! ఈ వార్షిక సగటు పెరుగుదల అనేది ఇదే కాలంలో సగటు ద్రవ్యోల్బణంతో సమానంగా లేదు. దీన్ని నేరుగా రూ.2.50 లక్షలకు పెంచాలి” అని ముంబైకి చెందిన పన్ను, పెట్టుబడుల నిపుణుడు బల్వంత్ జైన్ అన్నారు.

పన్ను శ్లాబుల్లో మార్పులు..

"పన్ను శ్లాబులు 2014 నుంచి మారలేదు. హైయర్​ రియల్​ ట్యాక్స్​ రేట్స్​తో ఇది కుటుంబాలపై భారం మోపుతోంది. ద్రవ్యోల్బణానికి పన్ను శ్లాబ్ పరిమితులను ఇండెక్సేషన్​ చేయడం వల్ల ఆర్థిక నష్టం లేకుండా వ్యయ ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి మధ్యతరగతి వినియోగదారుల చేతిలో ఎక్కువ డబ్బు ఉంటుంది," అని షార్ ఇండియా ఫిన్ క్యాప్ ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​ అగమ్ గుప్తా అన్నారు.

Budget 2024 latest news : 2023 బడ్జెట్​ని ప్రవేశపెట్టిన సమయంలో.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకునే విధంగా స్లాబ్ రేట్లను సవరించారు.

  • రూ.3 లక్షల లోపు ఆదాయానికి పన్ను విధించరు
  • రూ.3-6 లక్షల మధ్య ఆదాయంపై 5 శాతం పన్ను
  • రూ.6-9 లక్షల మధ్య ఆదాయంపై 10 శాతం
  • రూ.9-12 లక్షల మధ్య ఆదాయంపై 15 శాతం పన్ను
  • రూ.12-15 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం పన్ను
  • రూ.15 లక్షలు, అంతకంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తున్నారు.

ఎన్​పీఎస్​ ఉపసంహరణలపై పన్ను నిబంధనలు

Budget 2024 date and time : ప్రస్తుత ఉన్న చట్టం ప్రకారం.. ఖాతాను మూసివేసే సమయంలో ఎన్​పీఎస్​ ఖాతా నుంచి 60% ఉపసంహరణలను మాత్రమే మినహాయింపు ఉంటోంది. మిగిలిన వాటి కోసం యాన్యుటీని కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. "యాన్యుటీ అందుకున్నప్పుడు పన్ను పరిధిలోకి వస్తుందని నేను సూచించాలనుకుంటున్నాను. సింపుల్​గా చెప్పాలంటే, కార్పస్​లో 60% మాత్రమే పన్ను రహితంగా ఉంటుంది, మిగిలినది వెంటనే కాకపోయినా భవిష్యత్తులో పన్ను పరిధిలోకి వస్తుంది," అని బల్వంత్ జైన్ చెప్పారు.

ఎన్​పీఎస్​ ఉపసంహరణలకు భిన్నంగా.. ఉద్యోగి భవిష్య నిధి (ఇపిఎఫ్) లో పేరుకుపోయిన బ్యాలెన్స్.. రిటైర్మెంట్ సమయంలో పూర్తిగా పన్ను రహితంగా వస్తుంది.

40 శాతం కార్పస్ తో యాన్యుటీ కొనుగోలు చేయాలనే నిబంధనను ప్రభుత్వం తొలగించాలని, ఆ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే నిర్ణయాన్ని చందాదారుడికే వదిలేయాలని జైన్ డిమాండ్ చేశారు.

ప్రిన్సిపల్ రీపేమెంట్​కు ప్రత్యేక పరిమితి..

Budget 2024 updates : ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రస్తుత నిబంధనల ప్రకారం.. నివాస గృహం కోసం తీసుకున్న గృహ రుణానికి చెందిన అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి రూ .1.5 లక్షల వరకు మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. జీవిత బీమా ప్రీమియంలు, ట్యూషన్ ఫీజులు, ప్రావిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎఫ్​కు కంట్రిబ్యూషన్లు, ఈఎల్ఎస్ఎస్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లు, ట్యాక్స్ సేవింగ్ బ్యాంక్ ఎఫ్డిలు మొదలైన ఇతర అర్హత కలిగిన ఖర్చులతో పాటు ఈ మినహాయింపు లభిస్తుంది.

"సెక్షన్ 80సీ, 80సీసీసీ, 80 సీసీడీ(1) లో ఓవర్​క్రౌడింగ్​ ఉంటోంది, పెద్ద గృహ రుణాల అవసరాన్ని బట్టి, వచ్చే బడ్జెట్​లో గృహ రుణాల చెల్లింపునకు ఆర్థిక మంత్రి ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలి. మొదటిసారి గృహ కొనుగోలుదారులకు గృహ రుణాలపై వడ్డీ కోసం.. 2019 లో ప్రవేశపెట్టిన సెక్షన్ 80ఈఈఏ నుంచి సాయం తీసుకోవచ్చు," అని బల్వంత్ జైన్ చెప్పారు.

కాబట్టి, మోదీ 2.0 మధ్యంతర బడ్జెట్ 2024పై అనేక అంచనాలు ఉన్నాయి. అయితే ఈ అంచనాలు ఎంతవరకు నెరవేరుతాయో 2024 ఫిబ్రవరి 1న చూడాలి.

అయితే ఫిబ్రవరిలో జరిగే మధ్యంతర బడ్జెట్ లో భారీ ప్రకటనలు వస్తాయన్న అంచనాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇపప్పటికే తోసిపుచ్చారు. ఓట్ ఆన్ అకౌంట్ అవుతుందని, అద్భుతమైన ప్రకటనలు ఉండకపోవచ్చని చెప్పారు.

(గమనిక:- పైన చేసిన అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను తనిఖీ చేయాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు.)

Whats_app_banner

సంబంధిత కథనం