BMW Electric Scooter : 108 కి.మీ రేంజ్, రివర్స్ గేర్‌తో వచ్చిన బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇదిగో ఫీచర్లు
BMW CE 02 Electric Scooter : బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల అయింది. ఈ స్కూటీ 108 కిలో మీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. దీని ధరతోపాటుగా ఫీచర్లు గురించి తెలుసుకోండి.
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ BMW Motorrad దేశీయ విపణిలో వివిధ రకాల లగ్జరీ బైక్‌లు, స్కూటర్‌లను విక్రయిస్తోంది. కొత్తగా BMW CE 02 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, స్పెసిఫికేషన్ల గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం..
ధర
ఈ కొత్త BMW CE 02 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఖరీదైనది. రూ.4.5 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేశారు. కొత్త BMW CE02 ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్మిక్ బ్లాక్, కాస్మిక్ బ్లాక్ 2 అనే రెండు ఆప్షన్స్‌లో ఉంది.
ఫీచర్లు
కొత్త BMW CE 02 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌లో యంగ్ కస్టమర్‌లను ఆకర్షించే విధంగా ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్‌లో 3.5-అంగుళాల TFT డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, USB-C ఛార్జింగ్ సాకెట్, రివర్స్ గేర్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి.
డిజైన్
BMW CE 02 ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా అధునాతన డిజైన్‌తో వచ్చింది. స్కూటర్‌లో దీర్ఘచతురస్రాకార LED హెడ్‌లైట్, LED DRLలు, విండ్‌స్క్రీన్, 14-అంగుళాల చక్రాలు, 120/80-R14 అండ్ 150/70-R14 సైజుతో టైర్లు, ఫ్లాట్ సీట్, LED లైటింగ్ సెటప్ అండ్ 2-గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి.
పనితీరు
కొత్త బీఎండబ్ల్యూ సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3.92 KWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఫుల్ ఛార్జింగ్‌తో దాదాపు 108 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 14.7 PS శక్తిని, 55 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
రైడింగ్ మోడ్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఫ్లో, సర్ఫ్, ఫ్లాష్ అనే 3 రైడింగ్ మోడ్ ఎంపికలు ఉన్నాయి. దీని గరిష్ట వేగం గంటకు 95 కి.మీ. ఇది కేవలం 3 సెకన్లలో 0 నుండి 50 కిమీ వేగాన్ని అందుకుంటుంది. 1,350 mm పొడవైన వీల్‌బేస్‌ను కూడా పొందుతుంది. ఫ్రంట్ గోల్డ్ ఫినిషింగ్ అప్‌సైడ్-డౌన్ ఫోర్క్స్, వెనుక (అరుదైన) మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. దీనికి డిస్క్ బ్రేకులు కూడా లభిస్తాయి. ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ASC (ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్), RSC (రికవరీ స్టెబిలిటీ కంట్రోల్) వంటి భద్రతా ఫీచర్లను బీఎండబ్ల్యూ సీఈ 02 కలిగి ఉంటుంది.