BMW Electric Scooter : స్టైలిష్‌గా వస్తున్న బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్.. దీనికి రివర్స్ గేర్ కూడా-bmw electric scooter ce02 with reverse gear launch confirmed in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bmw Electric Scooter : స్టైలిష్‌గా వస్తున్న బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్.. దీనికి రివర్స్ గేర్ కూడా

BMW Electric Scooter : స్టైలిష్‌గా వస్తున్న బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్.. దీనికి రివర్స్ గేర్ కూడా

Anand Sai HT Telugu
Sep 30, 2024 04:30 PM IST

BMW Electric Scooter : బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ సీఈ02 లాంచ్‌కు రెడీ అయింది. అక్టోబర్ 1న భారత మార్కెట్‌లోకి దీనిని విడుదల చేస్తున్నారు. ఇందులో చాలా ఫీచర్లు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం..

బీఎండబ్ల్యూ సీఈ02
బీఎండబ్ల్యూ సీఈ02

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. దేశీయ ఆటోమేకర్లే కాదు.. అంతర్జాతీయంగా పేరు ఉన్న ప్రముఖ కంపెనీలు కూడా భారత మార్కెట్ వైపు చూస్తున్నాయి. విదేశీ వాహన తయారీదారులు కూడా భారతదేశాన్ని ఒక ముఖ్యమైన మార్కెట్‌గా చూస్తున్నారు. అక్టోబర్ 1న BMW తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ CE 02ని విడుదల చేయడం దాదాపు ఖాయమైంది. కొత్త BMW CE 02 స్కూటీ టీవీఎస్ మోటార్ కంపెనీ సహకారంతో భారతదేశంలో తయారు చేశారు.

బీఎండబ్ల్యూ కొన్ని వారాల క్రితం భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం సీఈ 04ను విడుదల చేసింది. ఇప్పుడు కొన్ని వారాల తర్వాత మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. దీనితో లగ్జరీ బ్రాండ్ అయిన బీఎండబ్ల్యూ భారతదేశంలో తన కొత్త వాహనాల అమ్మకాలను పెంచుకునే ఆలోచనలో ఉంది.

బీఎండబ్ల్యూ సీఈ 02 అంచనా ధర

స్కూటీ ధర గురించి ఇంకా కచ్చితమైన సమాచారం లేదు. ఈ మోడల్ భారతదేశంలో తయారు చేశారు. దీని ధర రూ.5 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే తక్కువగా ఉంటుందని అంచనా. అనేక ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే ఇది చాలా ఖరీదైనది.

ఫీచర్లు ఏంటి?

కొత్త బీఎండబ్ల్యూ సీఈ 02 స్కూటర్, మోటార్ సైకిల్ రెండింటినీ కలిపి రూపొందించారు. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించినట్టుగా ప్రత్యేకమైన డిజైన్‌తో వస్తుంది. ఇది తక్కువ బాడీ ప్యానెల్స్, ఫ్లాట్ సీటు, ఆకర్షణీయమైన LED హెడ్‌ల్యాంప్‌తో ఉంటుంది. 239 mm ఫ్రంట్, 220 mm వెనుక డిస్క్ బ్రేక్‌లు, ముందువైపు USD ఫోర్కులు, వెనుకవైపు మోనోషాక్, వైడ్-ఆస్పెక్ట్ 14-అంగుళాల వీల్ సెటప్‌తో సహా ప్రీమియం హార్డ్‌వేర్‌ను కలిగి ఉంది.

బ్యాటరీ, రేంజ్

బీఎండబ్ల్యూ సీఈ 02 స్కూటర్ PMS ఎయిర్-కూల్డ్ ఎలక్ట్రిక్ మోటారుతో ఆధారితం, రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. 11kW (14.7 bhp), 4kW (5.3 bhp). 4 kW వెర్షన్ గరిష్టంగా 45 kmph వేగాన్ని కలిగి ఉంది. అయితే 11 kW వెర్షన్ 95 kmph గరిష్ట వేగాన్ని అందుకోగలదు.

ఇది ఒకే ఛార్జ్‌పై 45 కిలో మీటర్ల రేంజ్‌ని ఇస్తుంది. కావాలంటే మరొక 2kW బ్యాటరీని జోడించే ఆప్షన్ కూడా పొందవచ్చు. ఈ రెండూ మీకు ఒకే ఛార్జ్‌పై 90km రేంజ్ ఇస్తాయని అంటున్నారు.

బీఎండబ్ల్యూ సీఈ 02 స్కూటర్‌లో కనెక్టివిటీ ఎంపికలతో కూడిన 3.5-అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే అమర్చారు. మీరు సర్ఫ్, ఫ్లో అనే రెండు రైడింగ్ మోడ్‌లను కూడా పొందుతారు. LED లైటింగ్, USB ఛార్జింగ్, రివర్స్ గేర్‌లాంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

Whats_app_banner