Nikhil Kamath house : ఎట్టకేలకు మొదటి ఇల్లు కొన్న నిఖిల్​ కామత్​​.. ఎందుకు మనసు మార్చుకున్నారు?-billionaire nikhil kamath buys his first house ending renting vs buying debate ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nikhil Kamath House : ఎట్టకేలకు మొదటి ఇల్లు కొన్న నిఖిల్​ కామత్​​.. ఎందుకు మనసు మార్చుకున్నారు?

Nikhil Kamath house : ఎట్టకేలకు మొదటి ఇల్లు కొన్న నిఖిల్​ కామత్​​.. ఎందుకు మనసు మార్చుకున్నారు?

Sharath Chitturi HT Telugu
Oct 19, 2024 11:15 AM IST

Buy or rent house : సొంత ఇల్లు కన్నా అద్దె నివాసంలో ఉండటమే బెటర్​ అని ఇంతకాలం చెప్పిన జెరోథా కో-ఫౌండర్​ నిఖిల్​ కామత్​.. ఎట్టకేలకు తన మొదటి ఇంటిని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

నిఖిల్​ కామత్​ ఇల్లు ఎందుకు కొన్నారు?
నిఖిల్​ కామత్​ ఇల్లు ఎందుకు కొన్నారు? (Mint file)

ఇల్లు కొనుక్కోవాలా? రెంట్​కి తీసుకోవాలా? అన్న అంశం ఎప్పుడు చర్చల్లో ఉంటూనే ఉంటుంది. జెరోథా కో-ఫౌండర్​ నిఖిల్​ కామత్​ మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై క్లియర్​ కట్​ ఆన్సర్​ ఇచ్చేవారు. ఇల్లు కొనడటం కన్నా అద్దెకు తీసుకోవడం బెస్ట్​ ఆప్షన్​ అని, తాను కూడా ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా కొనలేదని చాలా సందర్భాల్లో తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. కానీ ఇప్పుడు, ఎట్టకేలకు నిఖిల్​ కామత్​ తన మొదటి ఇంటిని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

“డబ్ల్యుటీఎఫ్ విత్ నిఖిల్ కామత్” తాజా ఎపిసోడ్ లైవ్​ అయ్యింది. ఇందులో కామత్.. ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్- ఎండి ఇర్ఫాన్ రజాక్, బ్రిగేడ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిరూప శంకర్, వీవర్క్ ఇండియా సీఈఓ కరణ్ విర్వానీతో చర్చించారు. వీరి మధ్య ఇల్లు కొనుగోలు వర్సెస్ అద్దె చర్చ సాగింది.

ఇంతకాలం రెంటింగ్​కు సానుకూలంగా ఉన్న బిలియనీర్​ నిఖిల్​ కామత్​.. తాజాగా ‘అద్దె’ విషయంలో ఉన్న ఒక పెద్ద ప్రతికూలతను వెల్లడించారు.

"అద్దె ఇంట్లో ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఒక ప్రతికూలత కూడా ఉంది. మీరు ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెళ్లిపోవచ్చు అనే దానిపై మీకు ముందు చూపు ఉండదు. నేను ఓ ఇంటి నుంచి బయటకు వెళ్లవలసి వచ్చింది. కానీ నేను ఆ ఇంట్లో ఎక్కువ కాలం ఉండటానికి ఇష్టపడతాను," అని ఆయన అన్నారు.

నిఖిల్​ కామత్​ మాటలను మీరే వినండి..

ఇల్లు కొనడం వల్ల మీ ఆర్థిక బలం పెరుగుతుందని భావిస్తున్నారా అని అడిగినప్పుడు, రియల్ ఎస్టేట్ 'ఇల్లిక్విడ్​' స్వభావాన్ని తాను అసహ్యించుకుంటానని కామత్ చెప్పారు.

'రియల్ ఎస్టేట్ అంటే ఇల్లిక్విడ్'

బంగారం మీద నాకు ఆసక్తి ఉంది. రియల్ ఎస్టేట్ ఇల్లిక్విడ్​ స్వభావాన్ని నేను ద్వేషిస్తాను. ఇలాంటి చోట్ల కొనుగోలుదారులు తక్కువగా ఉంటారు. 10 మంది అమ్మాలని నిర్ణయిస్తే ధర అస్తవ్యస్తంగా మారుతుంది. ధర చాలా నిరంకుశంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఎక్కువ మంది ఉంటారు. ఫలానా కంపెనీలో పది లక్షల మంది విక్రయించాలని నిర్ణయిస్తే గణనీయమైన మార్పు వస్తుంది,” అని జెరోథా కో-ఫౌండర్​ అన్నారు.

ప్రాపర్టీ ధరపై ప్రభుత్వం విధించే స్టాంప్ డ్యూటీని చెల్లించడంపై జెరోథా సహ వ్యవస్థాపకుడు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 5 శాతం నుంచి 6 శాతం స్టాంప్ డ్యూటీ చెల్లించకుండానే స్టాక్ మార్కెట్లో కొనుగోలు- అమ్మగకాలు చేసుకోవచ్చని గుర్తు చేశారు.

“ఇల్లు కొనడం, అద్దెకు ఇవ్వడం ఆప్షన్స్​లో ఏది లాభదాయకమైన విషయం?” అన్న దానిపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ పాడ్​క్యాస్ట్​ల చర్చించుకున్నారు.

“ఒక స్థలాన్ని కొనడం, అద్దెకు ఇవ్వడం ద్వారా ఎవరూ డబ్బు సంపాదించరని నేను అనుకుంటున్నాను. ఎయిర్ బీఎన్​బీ లాంటి వాటికి ఏడాది పొడవునా ఆక్యుపెన్సీ ఉండదు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లను పరిగణనలోకి తీసుకుంటే ఈ పెట్టుబడిపై రాబడి అంతంతమాత్రంగానే ఉంటుంది” అని నిఖిల్​ కామత్​ అభిప్రాయపడ్డారు.

Whats_app_banner

సంబంధిత కథనం