New IPO : భారత్‌లో అతిపెద్ద ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. ఎల్ఐసీ రికార్డు బ్రేక్!-biggest indian ipo launch in october sebi greenlights to hyundai motor india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Ipo : భారత్‌లో అతిపెద్ద ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. ఎల్ఐసీ రికార్డు బ్రేక్!

New IPO : భారత్‌లో అతిపెద్ద ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. ఎల్ఐసీ రికార్డు బ్రేక్!

Anand Sai HT Telugu
Sep 25, 2024 07:35 AM IST

New IPO : భారత స్టాక్ మార్కెట్‌లో అతిపెద్ద ఐపీఓ రానుంది. అక్టోబర్‌లో మార్కెట్‌లోకి లాంచ్ అవనుంది. హ్యుందాయ్ రాకతో ఎల్ఐసీ రికార్డు బ్రేక్ కానుంది. ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద ఐపీఓ అవుతుంది.

ఇండియాలో అతిపెద్ద ఐపీఓకు గ్రీన్ సిగ్నల్
ఇండియాలో అతిపెద్ద ఐపీఓకు గ్రీన్ సిగ్నల్

భారత స్టాక్ మార్కెట్‌లో అతిపెద్ద ఐపీఓకు రంగం సిద్ధమైంది. హ్యుందాయ్ మోటర్ ఇండియా ఓపీఓకు వస్తుంది. 25 వేల కోట్లు సమీకరించాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే సెబీకి డ్రాఫ్ట్ పేపర్లు సమర్పించింది. రూ.25,000 కోట్లకు సెబీ ఆమోదం తెలిపింది. హ్యుందాయ్ మోటార్ ఐపీఓ అక్టోబర్‌లో లాంచ్ కానుంది. హ్యుందాయ్ ఐపీఓ 2.7 బిలియన్ డాలర్ల లిస్టింగ్‌తో ఎల్ఐసీ రికార్డును బద్దలు కొట్టగలదని అంటున్నారు. హ్యుందాయ్ మోటార్ దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ.

2022లో ఐపీఓకు వచ్చిన ఎల్ఐసీ 21వేల కోట్లు సమీకరించింది. ఇప్పటివరకు స్టాక్ మార్కెట్‌లో ఇదే పెద్ద ఐపీఓ. హ్యుందాయ్ మోటర్ ఇండియా రాకతో ఎల్ఐసీ రికార్డు బ్రేక్ కానుంది. ఐపీఓలో 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేసేందుకు హ్యుందాయ్ ప్రణాళికలు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరోవైపు సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత స్విగ్గీ తన ఐపీవో పరిమాణాన్ని 1.4 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.11,700 కోట్లు) పెంచాలని భావిస్తోంది. స్విగ్గీ ఇప్పుడు సెబీకి అప్డేటెడ్ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయాల్సి ఉంటుందని, ఆఫర్ పరిమాణాన్ని పెంచడానికి అక్టోబర్ మొదటి వారంలో వాటాదారుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

2021లో ప్రారంభించిన జొమాటో రూ.9,375 కోట్ల ఇష్యూ కంటే స్విగ్గీ ఐపీఓ పెద్దదిగా ఉండనుంది. ఐపీవోలో 10 కంపెనీలు 2022 మే నుంచి పబ్లిక్ ఆఫరింగ్స్ కోసం అత్యధికంగా రూ.17,047 కోట్లు సమీకరించాయి. జొమాటో ఐపీఓ 2021లో వచ్చింది. లాంచ్ సమయంలో ఇన్వెస్టర్లు దీన్ని చూసి ఆకర్శితులయ్యారు. మరోవైపు 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.4,179 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ నష్టాన్ని 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.2,350 కోట్లకు తగ్గించుకున్నట్లు ఈ నెల ప్రారంభంలో ఇన్వెస్టర్లతో పంచుకున్న వార్షిక నివేదికలో స్విగ్గీ తెలిపింది.

గమనిక: ఇది పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్ గురించి కేవలం సమాచారం మాత్రమే. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్‌కు లోబడి ఉంటుంది.