Google Pixel Discount : గూగుల్ పిక్సెల్ ఫోన్లపై మంచి డిస్కౌంట్.. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా-better discount on google pixel phones in online check how much you have to pay ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Google Pixel Discount : గూగుల్ పిక్సెల్ ఫోన్లపై మంచి డిస్కౌంట్.. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా

Google Pixel Discount : గూగుల్ పిక్సెల్ ఫోన్లపై మంచి డిస్కౌంట్.. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా

Anand Sai HT Telugu
Aug 11, 2024 03:02 PM IST

Google Pixel Phones Discount : గూగుల్ పిక్సెల్ ఫోన్ కొనాలి అనుకునేవారికి మంచి సమయం వచ్చింది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేయెుచ్చు. బ్యాంక్ ఆఫర్‌లో ఈ ఫోన్ 2 వేల రూపాయ డిస్కౌంట్‌తో మీ సొంతం అవుతుంది. గూగుల్ పిక్సెల్ 7, గూగుల్ పిక్సెల్ 7 ప్రో ఫోన్లపై డిస్కౌంట్ ఎంతో చూద్దాం..

గూగుల్ పిక్సెల్ 7
గూగుల్ పిక్సెల్ 7

గూగుల్ తన పిక్సెల్ 9 సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ కొత్త ఫోన్లు ఆగస్టు 13న లాంచ్ కానున్నాయి. ఇదిలా ఉండగా, గూగుల్‌కు చెందిన రెండు గొప్ప స్మార్ట్‌ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ల పేర్లు గూగుల్ పిక్సెల్ 7, గూగుల్ పిక్సెల్ 7 ప్రో. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ కలిగిన పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్ రూ.32,999కు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లో మీరు ఈ ఫోన్‌ను రూ.2 వేల వరకు చౌకగా పొందవచ్చు. పిక్సెల్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర రూ.44,999గా ఉంది. దీనిపై కూడా 2 వేల రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ కోసం ఈ ఆఫర్ అందిస్తోంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు హోల్డర్లు ఈ ఫోన్‌ను 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో పిక్సెల్ 7 రూ.22,950 వరకు, పిక్సెల్ 7 ప్రో రూ.38,300 వరకు చౌకగా లభించనున్నాయి. ఎక్స్చేంజ్‌లో వచ్చే డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.

గూగుల్ పిక్సెల్ 7

ఈ ఫోన్లో 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కంపెనీ అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రాసెసర్ గా టెన్సర్ జీ2 చిప్ సెట్ ను ఫోన్ లో చూడొచ్చు. ఫొటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఇందులో అందించారు. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 11 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కంపెనీ అందిస్తోంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉంది. ఈ బ్యాటరీ 30 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం ఈ ఫోన్‌లో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

గూగుల్ పిక్సెల్ 7 ప్రో

పిక్సెల్ 7 ప్రో విషయానికొస్తే, ఈ ఫోన్‌లో మీరు 6.7 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ + అమోఎల్ఇడి డిస్‌ప్లే పొందుతారు. ఈ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్‌లో టెన్సర్ జీ2 ప్రాసెసర్ కనిపిస్తుంది. ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్. అలాగే ఇక్కడ మీరు 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్, 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ను చూడవచ్చు. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

Whats_app_banner