Motorola Phone Discount : మోటరోలా 5జీ ఫోన్‌పై మంచి డిస్కౌంట్.. కేవలం రూ.9999 చెల్లిస్తే చాలు-better discount offer on motorola g45 5g smartphone come up with good camera and battery ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Motorola Phone Discount : మోటరోలా 5జీ ఫోన్‌పై మంచి డిస్కౌంట్.. కేవలం రూ.9999 చెల్లిస్తే చాలు

Motorola Phone Discount : మోటరోలా 5జీ ఫోన్‌పై మంచి డిస్కౌంట్.. కేవలం రూ.9999 చెల్లిస్తే చాలు

Anand Sai HT Telugu
Nov 03, 2024 10:30 PM IST

Motorola G45 5G Discount : మోటరోలా ఫోన్ కొనాలి అనుకునేవారికి గుడ్‌న్యూస్. మీ కోసం మంచి డిస్కౌండ్ అందుబాటులో ఉంది. తక్కువ ధరలో మోటరోలా జీ45 5జీ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

మోటరోలా ఫోన్‌పై డిస్కౌంట్
మోటరోలా ఫోన్‌పై డిస్కౌంట్

మోటరోలా జీ45 5జీ ఫోన్ ధరను కంపెనీ తగ్గించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్ నడుస్తోంది. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో 23 శాతం తగ్గింపుతో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మీరు ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే మీకు 5 శాతం అదనపు తగ్గింపు కూడా దొరుకుతుంది. దీంతో ఈ ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

yearly horoscope entry point

కంపెనీ మోటరోలా జీ45 5జీని కేవలం రూ.9,999కే విక్రయిస్తోంది. ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది స్పాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌పై నడుస్తోంది. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దీనితో పాటు ఇది 5000mAh బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో సహా అనేక ఫీచర్లను పొందుతుంది. బడ్జెట్ ధరలో మంచి ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మోటరోలా జీ45 5జీ ఫోన్ బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

మోటరోలా జీ45 5జీ ఫోన్ ధర 4జీబీ ప్లస్ 128జీబీ స్టోరేజ్ ధర రూ 10,999గా ఉంది. డిస్కౌంట్ తర్వాత రూ 9,999కు వస్తుంది. 8జీబీ ప్లస్ 128జీబీ స్టోరేజ్ ఫోన్ ధర చూసుకుంటే రూ 12,999గా ఉండగా.. రూ 11,999కి దొరుకుతుంది. కంపెనీ మోటరోలా జీ45ని రెండు స్టోరేజ్ వేరియంట్లలో విక్రయిస్తోంది. ఈ ఫోన్ 4జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లు రూ. 10,999 వద్ద ప్రారంభించారు. 8జీబీ ప్లస్ 128జీబీ స్టోరేజీని రూ. 12,999తో పరిచయం చేశారు. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. వివా మెజెంటా, బ్రిలియంట్ బ్లూ, బ్రిలియంట్ గ్రీన్ రంగులలో విక్రయిస్తారు.

మోటరోలా జీ45 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1600 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో ఉంటుంది. ప్రాసెసర్ సామర్థ్యం స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో పని చేస్తుంది. ఇందులో 4జీబీ, 8జీబీ LPDDR4X ర్యామ్, 128జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్, మైక్రో ఎస్‌డీతో 1టీబీ వరకు పెంచుకునే మెమరీ ఉన్నాయి.

కెమెరా సెటప్ మోటరోలా జీ45 5G మొబైల్‌లో 50 మెగాపిక్సెల్ క్వాడ్ పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌లో ఆటో ఇమేజ్ మెరుగుదల, మాక్రో విజన్ కెమెరా, ఆటో నైట్ విజన్, ఇతర ఫీచర్లు ఉన్నాయి. 

ఈ ఫోన్ 5000mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. ఫోన్ 162.7 x 74.64 x 8.03mm మందం, 18 గ్రాముల బరువు ఉంటుంది. ఇతర ఫీచర్లు మోటరోలా జీ45 5G మొబైల్ నీరు, ధూళి నిరోధకత కోసం ఐపీ52 రేటింగ్ పొందింది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

Whats_app_banner