Best smartphones : 20వేల బడ్జెట్లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌కి సూపర్ డిమాండ్- మరి ఏది కొనాలి?
Best budget smartphones : శాంసంగ్ గెలాక్సీ ఏ16 వర్సెస్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్..ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్? ఏది కొనొచ్చు? ఇక్కడ చూసేయండి..
సరసమైన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ ఇటీవల గెలాక్సీ ఏ16 పేరుతో కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. అయితే ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్‌తో పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? ఏది వాల్యూ ఫర్ మనీ? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
శాంసంగ్ గెలాక్సీ ఏ16 వర్సెస్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్:
డిజైన్- డిస్ప్లే:శాంసంగ్ గెలాక్సీ ఏ16 మునుపటి మాదిరిగానే ఫ్లాట్ డిజైన్, ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 164.4 x 77.9 x 7.9 ఎంఎం కొలతలు, 200 గ్రాముల బరువుతో వస్తుంది. మరోవైపు, వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ రెండు కెమెరా సెన్సార్లు, ఎల్ఇడి ఫ్లాష్‌తో పిల్ ఆకారంలో ఉన్న కెమెరాతో ప్రత్యేకమైన డిజైన్ని కలిగి ఉంది. రక్షణ కోసం, రెండు స్మార్ట్‌ఫోన్స్ ఐపీ54 రేటింగ్‌తో వస్తాయి.
శాంసంగ్ గెలాక్సీ ఏ16 స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచ్ ఫుల్హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. నార్డ్ సీఈ4 లైట్ 6.67 ఇంచ్ ఫుల్హెచ్డీ+ అమోలెడ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200నిట్స్ వరకు బ్రైట్నెస్ కలిగి ఉంది. అందువల్ల, వన్‌ప్లస్ వేగవంతమైన నావిగేషన్ బ్రైట్నెన్ని అందిస్తుంది, కానీ శాంసంగ్ హెచ్డీఆర్ కంటెంట్‌ని అందిస్తుంది.
కెమెరా: గెలాక్సీ ఏ16 ట్రిపుల్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. ఇందులో ఇఐఎస్ సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా,2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. మరోవైపు, వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ డ్యూయెల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా విత్ ఓఐఎస్- 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ని అందిస్తుంది. ముందువైపు శాంసంగ్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందిస్తుండగా, వన్‌ప్లస్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది.
పర్ఫార్మెన్స్, బ్యాటరీ: శాంసంగ్ గెలాక్సీ ఏ16లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695, 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఉన్నాయి.
ఛార్జింగ్ పరంగా, గెలాక్సీ ఏ16 25 వాట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ధర: శాంసంగ్ గెలాక్సీ ఏ16 8 జీబీ ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ .18999. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 నుంచి ప్రారంభమవుతోంది.
సంబంధిత కథనం