Top automatic cars under 10 lakh : రూ. 10లక్షల బడ్జెట్​లోపు.. టాప్​ ఆటోమెటిక్​ కార్లు ఇవే!-automobile news top 5 automatic cars under 10 lakh tata punch to hyundai exter ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Top Automatic Cars Under 10 Lakh : రూ. 10లక్షల బడ్జెట్​లోపు.. టాప్​ ఆటోమెటిక్​ కార్లు ఇవే!

Top automatic cars under 10 lakh : రూ. 10లక్షల బడ్జెట్​లోపు.. టాప్​ ఆటోమెటిక్​ కార్లు ఇవే!

Sharath Chitturi HT Telugu
Feb 02, 2024 10:39 AM IST

Best automatic cars in India under ₹10 Lakh : ట్రాఫిక్​ని చూసి విసిగెత్తిపోయారా? రోడ్ల మీద ఇక మేన్యువల్​ కారు నడపలేనని భావిస్తున్నారా? అయితే.. ఇండియాలో.. రూ. 10లక్షల బడ్జెట్​లోపు అందుబాటులో ఉన్న టాప్​ ఆటోమెటిక్​ కార్స్​ లిస్ట్​ మీకోమే..

రూ. 10లక్షల బడ్జెట్​లో టాప్​ ఆటోమెటిక్​ కార్లు ఇవే!
రూ. 10లక్షల బడ్జెట్​లో టాప్​ ఆటోమెటిక్​ కార్లు ఇవే!

Best automatic cars in India : దేశంలో.. ఇటీవలి కాలంలో ఆటోమెటిక్​ వెహికిల్స్​కి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. నగరాల్లో ట్రాఫిక్​ కష్టాలను భరించలేక.. చాలా మంది ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​వైపు అడుగులు వేస్తున్నారు. మరి.. మీరు కూడా ఒక ఆటోమెటిక్​ కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! దేశంలో.. రూ. 10లక్షల బడ్జెట్​లోపు అందుబాటులో ఉన్న ది బెస్ట్​ ఆటోమెటిక్​ వెహికిల్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

రూ. 10లక్షల బడ్జెట్​- టాప్​ ఆటోమెటిక్​ కార్స్​..

మారుతీ సుజుకీ ఇగ్నిస్​:- క్రాసోవర్​- హ్యాచ్​బ్యాక్​కి మిక్స్​గా ఉంటుంది ఈ ఇగ్నిస్​ డిజైన్​. ఎస్​యూవీ కాకపోయినా.. డిజైన్​ని చూస్తే మాత్రం.. ఇదొక మైక్రో ఎస్​యూవీ అనిపిస్తుంది. ప్రీమియం నెక్సా షోరూమ్స్​లో వీటిని విక్రయిస్తోంది మారుతీ సుజుకీ. ఇందులో 1.2 లీటర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 88 బీహెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. 5 స్పీడ్​ ఏఎంటీ గేర్​బాక్స్​ దీని సొంతం. దీని ఎక్స్​షోరూం ధర రూ. 6.93లక్షలు- రూ. 8.16లక్షల మధ్యలో ఉంటుంది.

Tata Punch on road price Hyderabad : టాటా పంచ్​:- ఇండియాలో.. బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఈ టాటా పంచ్​ ఒకటి. ఈ సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ ఏఎంటీ వర్షెన్​లో 12 ట్రిమ్స్​ ఉండటం విశేషం. వీటిల్లోని 11 ఆప్షన్స్​ ధర రూ. 10లక్షల (ఎక్స్​షోరూం ప్రైజ్​) కన్నా తక్కువగా ఉన్నాయి. టాప్​ ఎండ్​ మోడల్​ని పక్కన పెడితే.. ఈ టాటా పంచ్​ ఏఎంటీ ఎస్​యూవీ ఎక్స్​షోరూం ధర రూ. 7.50లక్షలు- రూ. 9.35లక్షల మధ్యలో ఉంటుంది. ఇందులోని 1.2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​కి 5 స్పీడ్​ ఏఎంటీ కనెక్ట్​ చేసి ఉంటుంది. ఇది.. 87 బీహెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది.

హ్యుందాయ్​ ఎక్స్​టర్​:- హ్యుందాయ్​ నుంచి కొత్తగా వచ్చిన ఎక్స్​టర్​ ఎస్​యూవీకి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఏఎంటీ వర్షెన్​లో ఆరు వేరువేరు ట్రిమ్స్​ అందుబాటులో ఉన్నాయి. ఇందులోని 1.2 లీటర్​ కప్పా పెట్రోల్​ ఇంజిన్​.. 82 బీహెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. ఆరు వేరువేరు ట్రిమ్స్​లని ఐదంటి ఎక్స్​షోరూం ధర రూ. 10లక్షలలోపే ఉంటాయి.

Maruti Suzuki Fronx AMT on road price : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​:- 2023లో లాంచ్​ అయిన మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​.. ప్రీమియం హ్యాచ్​బ్యాక్​ బలెనోకి క్రాసోవర్​లా కనిపిస్తుంది. ఇందులో 1.0 లీటర్​ టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్​ ఇంజిన్​కి ఏఎంటీ కనెక్ట్​ చేసి ఉంటుంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఆటోమెటిక్​ ఎక్స్​షోరూం ధర రూ. 8.88లక్షలు- రూ. 9.28లక్షల మధ్యలో ఉంటుంది.

రెనాల్ట్​ ఖైగర్​:- ఇండియాలో రెనాల్ట్​కి ఉన్న ఏకైక ఎస్​యూవీ.. ఈ ఖైగర్​. ఏఎంటీ వర్షెన్​లో ఆరు ట్రిమ్స్​ ఉన్నాయి. వీటి ఎక్స్​షోరూ ధరలు రూ. 7.10లక్షలు- రూ. 9.53లక్షల మధ్యలో ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం