Apple TV 4K 2022 | కేవలం రూ.15 వేలకే ఆపిల్ టీవీ, ఫీచర్లు ఇవే!-apple tv 4k launched in india at rs 14 900 for the base model check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Apple Tv 4k 2022 | కేవలం రూ.15 వేలకే ఆపిల్ టీవీ, ఫీచర్లు ఇవే!

Apple TV 4K 2022 | కేవలం రూ.15 వేలకే ఆపిల్ టీవీ, ఫీచర్లు ఇవే!

HT Telugu Desk HT Telugu
Oct 19, 2022 04:10 PM IST

ఆపిల్ కంపెనీ కేవలం రూ. 15 వేల బడ్జెట్ ధరలో Apple TV 4K టీవీని విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

<p>Apple TV 4K</p>
Apple TV 4K

టెక్ దిగ్గజం Apple, తమ బ్రాండ్ నుంచి వరుస ఉత్పత్తులను విడుదల చేస్తూ ఎక్కడా తగ్గడం లేదు. ఆపిల్ ఐఫోన్14 సిరీస్ విడుదల మొదలుకొని ఇప్పటికే ఈ ఏడాదిలో అనేక ఉత్పత్తులను లాంచ్ చేసింది. తాజాగా iPad Pro 2022, ఐప్యాడ్ 10వ తరం పరికరాల విడుదలతో పాటు Apple TV 4K మోడల్‌ను కూడా విడుదల చేసింది. సాధారణంగా ఆపిల్ ఉత్పత్తులు అంటే అవి సామాన్యులు కొనలేనంత ఖరీదైనవిగా ఉంటాయి. అయితే ఆపిల్ టీవీ మాత్రం సరసమైన ధరలోనే మెరుగైన పనితీరు కలిగిన ఫీచర్లతో విడుదలైంది.

A15 బయోనిక్ చిప్‌తో నవీకరించిన Apple TV 4K మోడల్‌ భారత మార్కెట్లో కేవలం రూ. 14,900/- బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. Apple TV 4K టీవీ HDR10+కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ టీవీతో పాటు ఛార్జింగ్ కోసం USB-C పోర్ట్‌తో నవీకరించిన Siri రిమోట్‌ను పొందువచ్చు. Apple Music, Apple ఫిట్‌నెస్+, Apple ఆర్కేడ్‌, Apple TV+ వంటి వాటిని యాక్సెస్ చేయవచ్చు.

అంతేకాదు, Apple TV 4K 2022 ఎడిషన్ బేస్ స్టోరేజీని 32GB నుండి 64GBకి పెంచింది. ఈ టీవీ స్ట్రీమింగ్ బాక్స్, స్మార్ట్ హోమ్ హబ్ లేదా గేమింగ్ కన్సోల్ వంటి వాటితో కనెక్ట్ అయి వస్తుంది. అయితే బేస్ వేరియంట్ టీవీలో ఈథర్నెట్ పోర్ట్‌ను తీసివేసింది, కాబట్టి కనెక్టివిటీ కోసం Wi-Fiని మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.

ఇది కాకుండా, మరో వేరియంట్ కూడా ఉంది. ఇందులో Wi-Fi+ ఈథర్నెట్ రెండూ ఇచ్చారు. దీనిలో స్టోరేజ్ కెపాసిటీ 128GB వరకు ఉంది. ఈ మోడల్ రూ. 16,900/- ధరకు లభిస్తుంది.

Apple TV 4K 2022 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • డాల్బీ విజన్, 4K వీడియో
  • HDR10+, HDR10, HLG సపోర్ట్
  • A15 బయోనిక్ చిప్
  • 128GB ఇంటర్నల్ స్టోరేజ్
  • ఈథర్నెట్ పోర్ట్
  • థ్రెడ్ నెట్‌వర్కింగ్ సపోర్ట్
  • HDMI 2.1
  • Wi-Fi, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ
  • USB-C కనెక్టర్‌తో సిరి రిమోట్‌

Apple TV 4K నవంబర్ 4 నుండి అందుబాటులోకి వస్తుంది, అయితే apple.com/in/store లేదా Apple స్టోర్లలో ఇప్పటి నుంచే ఆర్డర్ చేయవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం