Mutual fund SIP : పవర్​ ఆఫ్​ 'కాంపౌండింగ్​'- నెలకు రూ. 10వేల సిప్​తో కోట్ల సంపద మీ సొంతం!-an sip of 10 000 a month in this franklin mutual fund would have made you a crorepati ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mutual Fund Sip : పవర్​ ఆఫ్​ 'కాంపౌండింగ్​'- నెలకు రూ. 10వేల సిప్​తో కోట్ల సంపద మీ సొంతం!

Mutual fund SIP : పవర్​ ఆఫ్​ 'కాంపౌండింగ్​'- నెలకు రూ. 10వేల సిప్​తో కోట్ల సంపద మీ సొంతం!

Sharath Chitturi HT Telugu
Mar 24, 2024 11:45 AM IST

Franklin India Focused Equity Fund : కోటీశ్వరులవ్వాలని కలలు కంటున్నారా? అయితే మీరు పవర్​ ఆఫ్​ కాంపౌండింగ్​ గురించి తెలుసుకోవాల్సిందే! రూ. 10వేల ఇన్​వెస్ట్​మెంట్​తో మీరు కోటీశ్వరులు అవ్వొచ్చు.

నెలకు రూ. 10వేలతో కోట్ల సంపద.. ఈ ఫండ్​తో సూపర్​ రిటర్నులు!
నెలకు రూ. 10వేలతో కోట్ల సంపద.. ఈ ఫండ్​తో సూపర్​ రిటర్నులు!

Franklin India Focused Equity Fund : స్టాక్​ మార్కెట్​లో ఇన్​వెస్ట్​మెంట్​ చేయాలంటే భయపడే వారికి మ్యూచువల్​ ఫండ్స్​ ఒక మంచి ఆప్షన్​. కానీ చాలా మంది మ్యూచువల్​ ఫండ్స్​లో సిప్​ (సిస్టెమాటిక్​ ఇన్​వెస్ట్​మెంట్​ ప్లాన్​) చేయడానికి కూడా భయపడతారు. వీరందరు.. 'కాంపౌండింగ్​'కి ఉన్న పవర్​ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. క్రమంక్రమంగా పెట్టుబడులు పెడుతూ వెళితే, భవిష్యత్తులో కోట్లల్లో సంపద సృష్టించుకోవచ్చని అర్థం చేసుకోవాలి. దీనిని ఇప్పుడు ఓ ఉదాహరణతో అర్థం చేసుకుందాము! ఫ్రాంక్లిన్​ ఇండియా ఫోకస్డ్​​ ఈక్విటీ ఫండ్​లో మీరు నెలకి రూ. 10వేలు ఇన్​వెస్ట్​ చేసి ఉంటే.. కేవలం 16ఏళ్లలోపే మీరు కోటీశ్వరులు అయ్యేవారు.

ఫ్రాంక్లిన్​ ఇండియా ఫోకస్డ్​​ ఈక్విటీ ఫండ్​..

2007 జులైలో లాంచ్​ అయ్యింది ఈ ఫ్రాంక్లిన్​ ఇండియా ఫోకస్డ్​ ఈక్విటీ ఫండ్. అప్పటి నుంచి ఇప్పటివరకు మంచి రిటర్నులు తెచ్చిపెట్టి, మదుపర్లను కోటీశ్వరులను చేసింది! దాదాపు 16ఏళ్ల వ్యవధిలో.. 14.33శాతం సీఏజీఆర్​తో వృద్ధి చెందింది ఈ ఫండ్​. ఏడాది ముందు ఈ మ్యూచువల్​ ఫండ్​లో నెలకు రూ. 10వేలు ఇన్​వెస్ట్ (మొత్తం రూ. 1.20లక్షలు)​ చేసి ఉంటే, ఇప్పుడు దాని విలువ రూ. 1.46 లక్షలు అయ్యేది. అదే విధంగా.. మూడేళ్లుగా ఈ ఫండ్​లో రూ. 10వేలు పెట్టుబడి​ చేస్తూ ఉంటే.. ఇన్​వెస్టెట్​ వాల్యూ రూ. 3.6లక్షలుగాను, మొత్తం వాల్యూ రూ. 4.96 లక్షలుగాను ఉండేది.

Mutual fund SIP explained in Telugu : ఐదేళ్లల పాటు నెలకు రూ. 10వేల సిప్​తో రూ. 6 లక్షల ఇన్​వెస్ట్​మెంట్​ని రూ. 10.26 లక్షలుగా మార్చింది ఈ ఫ్రాంక్లిన్​ ఇండియా ఫోక్స్​డ్​ ఈక్విటీ ఫండ్​. అదే విధంగా.. 10ఏళ్ల పీరియడ్​లో నెలకు రూ. 10వేలతో కూడిన రూ. 12 లక్షల ఇన్​వెస్ట్​మెంట్​ని రూ. 36.47 లక్షలుగా మార్చింది.

ఇక 2007 జులై నుంచి ఇందులో క్రమం తప్పకుండా నెలకు రూ. 10వేలు ఇన్​వెస్ట్​ చేసి ఉంటే.. మీ రూ. 20 లక్షల పెట్టుబడి.. ఈపాటికి రూ. 97.58 లక్షలుగా చేసి ఉండేది.

టెన్యూర్​            రిటర్నులు (%)రూ. 10వేల విలువ ఇన్​వెస్ట్​మెంట్​ (Rs)
1 year                                                                  36.551.46 lakh1.20 lakh
3 years                                                        20.094.96 lakh3.6 lakh
5 years                                              19.7310.26 lakh6 lakh
10 years                                              19.2736.47 lakh12 lakh
ఫండ్​ ప్రారంభం నుంచి..14.3397.58 lakh20 lakh

పవర్​ ఆఫ్​ కాంపౌండింగ్​..

ఇన్​వెస్ట్​మెంట్స్​ అనేవి లాంగ్​ టర్మ్​ని దృష్టి పెట్టి చేయాలి. అప్పుడే బ్యూటిఫుల్​ రిటర్నులు వస్తాయి. టైమ్​తో పాటు పెట్టుబడులు కూడా వృద్ధిచెందుతాయి. దిగ్గజ ఇన్​వెస్టర్​ వారెన్​ బఫెట్​ నుంచి ఎందరో ప్రముఖ వ్యాపారవేత్తలు.. కాంపౌండింగ్​కి ఉన్న పవర్​ని విశ్వసిస్తారు.

Mutual fund SIP calculator : మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు కూడా మీ మ్యూచువల్​ ఫండ్​ ఇన్​వెస్ట్​మెంట్​ జర్నీని మొదలుపెట్టండి. కోటీశ్వరులు అవ్వండి!

(గమనిక:- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)