Paytm FASTag: పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్; ఈ తేదీలోగా ఫాస్టాగ్ లను మార్చుకోండి..
Paytm FASTag: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో పేటీఎం ఫాస్టాగ్ వాడుతున్న వినియోగదారులకు జాతీయ రహదారుల అథారిటీ (NHAI) ఒక అలర్ట్ ను జారీ చేసింది. 2024, మార్చి 13 లోపు పేటీఎం ఫాస్టాగ్ వినియోగదారులు మరో బ్యాంక్ జారీ చేసిన కొత్త ఫాస్టాగ్ ను కొనుగోలు చేయాలని సూచించింది.
Paytm FASTag: 2024 మార్చి 13 లోపు పేటీఎం ఫాస్టాగ్ వినియోగదారులు మరో బ్యాంక్ జారీ చేసిన కొత్త ఫాస్టాగ్ ను కొనుగోలు చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సూచించింది. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు జరిమానాలు లేదా ఏదైనా డబుల్ ఫీజు ఛార్జీలను నివారించడానికి వెంటనే వేరే ఫాస్టాగ్ ను కొనుగోలు చేయాలని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ () పై ఆంక్షలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తాజా అడ్వైజరీని బుధవారం విడుదల చేసింది. 15 మార్చి 2024 తర్వాత, పేటీఎం ఫాస్టాగ్ వినియోగదారులు తమ ఫాస్టాగ్ ఖాతాను రీఛార్జ్ చేయలేరు. అలాగే, బ్యాలెన్స్ ను టాప్-అప్ చేయలేరు. కానీ వారు తమ ఖాతాలో ప్రస్తుతం ఉన్న బ్యాలెన్స్ ను టోల్ చెల్లించడానికి ఉపయోగించవచ్చు. "పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank) పై పరిమితులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, పేటీఎం ఫాస్టాగ్ వినియోగదారులు 2024 మార్చి 15 తర్వాత బ్యాలెన్స్ను రీఛార్జ్ చేయలేరు లేదా టాప్-అప్ చేయలేరు. అయితే, వారు తమ వద్ద ఉన్న బ్యాలెన్స్ ను టోల్ చెల్లించడానికి ఉపయోగించవచ్చు" అని ఎంఓఆర్టిహెచ్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. అలాగే, పేటీఎం ఫాస్టాగ్ వినియోగదారులు పేటీఎం ఫాస్టాగ్ కు సంబంధించి ఏవైనా ప్రశ్నలు లేదా సహాయం కోసం ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసిఎల్) వెబ్సైట్లో అందించిన ఎఫ్ఎక్యూలను పరిశీలించవచ్చని ఎంఓఆర్టిహెచ్ తెలిపింది.
ఈ బ్యాంక్స్ ఫాస్టాగ్ లను నుంచి తీసుకోవచ్చు
ఫాస్టాగ్ లను జారీ చేయగల అధీకృత బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) జాబితాను ఎన్ హెచ్ ఏ ఐ అప్డేట్ చేసింది. ఈ జాబితాలో ఫాస్టాగ్ లను జారీ చేయడానికి అర్హత కలిగిన మొత్తం 39 బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఉన్నాయి. అవి,
- ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్, కాస్మోస్ బ్యాంక్, డోంబివ్లి నగరి సహకారి బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఫినో పేమెంట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, జే అండ్ కే బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, లివ్ క్విక్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, నాగపూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, పంజాబ్ మహారాష్ట్ర బ్యాంక్, సారస్వత్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, జల్గావ్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్, త్రిస్సూర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్, యూకో బ్యాంక్ ల నుంచి ఫాస్టాగ్ లను కొనుగోలు చేయవచ్చు.