FASTag KYC deadline: మీ వాహనం ఫాస్టాగ్ ఇంకా యాక్టివ్ గా ఉందో, లేదో ఇలా తెలుసుకోండి..
FASTag KYC deadline: మీ ఫాస్టాగ్ కేవైసీ పూర్తి చేశారా? ఒక వేళ మీ వాహనం ఫాస్టాగ్ కేవైసీ పూర్తి కాకపోతే, ఆ ఫాస్టాగ్ డీయాక్టివేట్ అవుతుంది. లేదా దానిని బ్లాక్ లిస్ట్ లో పెట్టవచ్చు. మీ వాహనం ఫాస్టాగ్ యాక్టివ్ గా ఉందో? లేదో? ఇలా తెలుసుకోండి.
FASTag KYC deadline: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్దేశించిన ప్రకారం ఫాస్టాగ్ కేవైసీని అప్డేట్ చేయడానికి గడువు ఫిబ్రవరి 29 తో ముగిసింది. మొదట ఫాస్టాగ్ కేవైసీకి జనవరి 31 వరకే గడువు ఇచ్చారు. ఆ తరువాత ఆ గడువును ఫిబ్రవరి 29వ తేదీ వరకు పొడిగించారు. ఫిబ్రవరి 29 లోపు కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్ లను బ్యాంకులు డీయాక్టివేట్ చేస్తాయి. లేదా, బ్లాక్ లిస్ట్ లో పెడతాయి. ఒకవేళ మీ ఫాస్టాగ్ డీ యాక్టివేట్ అయినా, లేదా దానిని బ్లాక్ లిస్ట్ లో పెట్టినా.. మీరు టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ (FASTag KYC) ఉపయోగించి టోల్ చెల్లించలేరు. మీ ఫాస్టాగ్ కేవైసీ అసంపూర్తిగా ఉంటే, మీకు ఆ ఫాస్టాగ్ ను జారీ చేసిన బ్యాంక్ మీకు ఇమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తుంది. మీ ఫాస్టాగ్ కేవైసీని ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి మీరు ఈ ప్రక్రియను అనుసరించవచ్చు:
- fastag.ihmcl.com సందర్శించండి. మీ మొబైల్ నంబర్, ఓటిపి మరియు క్యాప్చా కోడ్ నమోదు చేయండి.
- లాగిన్ ఆప్షన్ క్లిక్ చేసి ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ కోసం సెర్చ్ చేయాలి.
- వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్(వీఆర్ఎన్)/ఎన్ఈటీసీ ఫాస్టాగ్ ఐడీ, క్యాప్చా ఎంటర్ చేసి 'చెక్ స్టేటస్' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
బ్యాంకులు జారీ చేసిన ఫాస్టాగ్ విషయంలో
- https://www.netc.org.in/request-fornetc-fastag సందర్శించండి. ఎన్ ఇటిసి ఫాస్టాగ్ అభ్యర్థన కింద, మీ ఫాస్టాగ్ ను జారీ చేసిన బ్యాంకును ఎంచుకోండి.
- ఆన్లైన్లో కేవైసీ అప్డేట్ చేయడానికి విజిట్ వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేసి ఫాస్టాగ్ ఇష్యూయర్ బ్యాంక్లోకి లాగిన్ అవ్వండి.
ఒకటి కన్నా ఎక్కువ ఫాస్టాగ్ లు ఉంటే..
- https://www.npci.org.in/what-we-do/netc-fastag/check-your-netcfastag-status లింక్ ను సందర్శించండి. మీ వాహన వివరాలను నమోదు చేయండి.
- అప్పుడు మీరు మీ వాహన నంబర్ లింక్ అయి ఉన్న అన్ని ఫాస్టాగ్ ల స్థితిని చూడవచ్చు.