2024 Hero Xtreme 160R 4V: కొత్త ఫీచర్స్, ట్రెండీ టెయిల్ లైట్ తో 2024 హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వీ లాంచ్
కొత్త ఫీచర్స్, ట్రెండీ టెయిల్ లైట్, కొన్ని కాస్మెటిక్ అప్ గ్రేడ్స్ తో 2024 హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వీ బైక్ లాంచ్ అయింది. అయితే, గత మోడల్స్ తో పోలిస్తే ఈ 2024 మోడల్ ధర రూ. 4 వేలు ఎక్కువ ఉంటుంది.
Hero Xtreme 160R 4V: హీరో మోటోకార్ప్ (hero motors) ఇటీవల భారత మార్కెట్లో తన ఎక్స్ ట్రీమ్ 160 ఆర్ 4విని అప్ డేట్ చేసింది. 160 సీసీ సెగ్మెంట్ గత కొన్నేళ్లుగా బాగా ప్రాచుర్యం పొందింది. 150 సీసీ కమ్యూటర్ ను కొనుగోలు చేయడానికి బదులుగా, ప్రజలు మరింత రోడ్ ప్రజెన్స్, మెరుగైన పవర్ ఉన్న బైక్స్ కు మొగ్గు చూపుతున్నారు. దాంతో, 160 సీసీ సెగ్మెంట్ లో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వీ బైక్ ను హీరో మోటోకార్ప్ లాంచ్ చేసింది.
2024 హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వి: అప్ డేటెడ్ గ్రాఫిక్స్, కొత్త కలర్ స్కీమ్
2024 హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వీ (Hero Xtreme 160R 4V) ఒరిజినల్ డిజైన్ లోనే ఉంటుంది. కానీ, కొత్తగా ఇప్పుడు నలుపు, బ్రాంజ్ యాక్సెంట్స్ తో కెవ్లార్ బ్రౌన్ పెయింట్ స్కీమ్ తో వస్తుంది. ఈ బైక్ కొత్త బాడీ గ్రాఫిక్స్ ను కూడా కలిగి ఉంది. అయితే మునుపటి కలర్ ఆప్షన్లైన నియాన్ షూటింగ్ స్టార్, మ్యాట్ స్లేట్ బ్లాక్ లు కూడా అందుబాటులో ఉన్నాయి.
2024 హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వి: కొత్త ఫీచర్లు
2024 ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వీ (Hero Xtreme 160R 4V) లో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, పానిక్ బ్రేక్ అలర్ట్ సిస్టమ్, డ్రాగ్ టైమర్ వంటి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. అదనంగా, 2024 మోడల్ లో మెరుగైన పిలియన్ సౌకర్యం కోసం సింగిల్-పీస్ సీటు ఉంటుంది. ఇది మునుపటి వెర్షన్లలో ఉన్న స్ప్లిట్ సీట్లకు భిన్నంగా ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ ముందు భాగంలో యూఎస్డీ ఫోర్క్ లు, వెనుక భాగంలో ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఉంటుంది. రెండు వైపులా డిస్క్ బ్రేక్ లను అమర్చారు. ఈ మోటార్ సైకిల్ కు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
ఎక్స్ ట్రీమ్ 160ఆర్ టూ వాల్వ్ వేరియంట్
ఎక్స్ ట్రీమ్ 160 ఆర్ టూ వాల్వ్ వేరియంట్ ఎప్పుడూ ఒకే సీటును కలిగి ఉండటం గమనార్హం. 2024 హీరో ఎక్స్ ట్రీమ్ 160R 4V లో మెరుగైన విజిబిలిటీ కోసం 300% పెరిగిన బ్రైట్ నెస్ తో కొత్త స్పీడోమీటర్ ఉంది. అలాగే, హెచ్-మోటిఫ్ తో రీడిజైన్ చేసిన టెయిల్ లైట్ ఉంటుంది. ఇందులో 163.2 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 16.6 బీహెచ్పీ, 14 ఎన్ఎమ్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.
2024 హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వీ ధర
2024 హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వీ కొత్త కలర్ ధర రూ.1,38,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. దీంతో ధర రూ.4,000 పెరిగింది. ఇది ఇప్పుడు 'ప్రీమియం' అనే సింగిల్ ఫుల్లీ లోడెడ్ వేరియంట్లో అందుబాటులో ఉంది.