MP Vijayasai Reddy : పురందేశ్వరి గారు.. నాకైతే లిక్కర్ బ్రాండ్లు కూడా తెలియవు, ఆధారాలు ఉంటే బయటపెట్టండి-ycp mp vijayasai reddy counter to purandeswari comments on liquor ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mp Vijayasai Reddy : పురందేశ్వరి గారు.. నాకైతే లిక్కర్ బ్రాండ్లు కూడా తెలియవు, ఆధారాలు ఉంటే బయటపెట్టండి

MP Vijayasai Reddy : పురందేశ్వరి గారు.. నాకైతే లిక్కర్ బ్రాండ్లు కూడా తెలియవు, ఆధారాలు ఉంటే బయటపెట్టండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 28, 2023 06:32 PM IST

YCP MP Vijaya Sai Reddy News : బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని మరోసారి టార్గెట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి.లిక్కర్ సరఫరాలో నాపై, మిథున్ రెడ్డిపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. దమ్ముంటే ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఎంపీ విజయసాయిరెడ్డి  - పురందేశ్వరి
ఎంపీ విజయసాయిరెడ్డి - పురందేశ్వరి

MP Vijayasai Reddy : గత కొంతకాలంగా పురందేశ్వరి వర్సెస్ వైసీపీ అన్నట్టు మధ్య మాటల యుద్దం సాగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టు కేసులోనూ పురందేశ్వరిపై విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి… మరో అంశంపై స్పందించారు. మద్యం సరఫరా పేరుతో దందా చేస్తున్నారంటూ మిథన్ రెడ్డితో పాటు తనపై ఆరోపణలు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు.

yearly horoscope entry point

ఆరోపణలు చేసే ముందు పురంధేశ్వరి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని అన్నారు. ఏ మాత్రం సంబంధంలేని ఇద్దరు వ్యక్తులపై పురంధేశ్వరి ఆరోపణలు చేయడం తగదన్నారు. లిక్కర్‌ విషయంలో ఆధారాలు లేకుండా తనపై, విథున్‌రెడ్డిపై విమర్శలు చేయడమేంటని నిలదీశారు.

పురందేశ్వరి అనే వ్యక్తి గతంలో కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు.ఆమెకు నిలకడలేదు. సిద్ధాతాలు లేవు, నైతిక విలువులు లేవు. మహిళగా ఆమెను గౌరవిస్తాం. నాపై మిధున్ రెడ్డి గురించి లిక్కర్ విషయంలో ఆరోపణలు చేశారు. ఆమెకంటూ నియోజకవర్గం ఉందా..? కుటుంబ ప్రయోజనాలు, సొంత అజెండాతో ముందు తీసుకెళ్తున్నారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాలు ఆమెకు పట్టవు. పురందేశ్వరి తెలిసిందే ఆమె కుటుంబం గురించి మాత్రమే. కేవలం ఆమె సాజామికవర్గం గురించే తెలుసు. అలాంటి వ్యక్తికి స్పష్టంగా చెబుతున్నాను.. పురందేశ్వరి గారు.. ఆరోపణలు చేసే ముందు ఆధారాలను వెరిఫై చేసుకోని మాట్లాడండి. నిజంగా ఆధారాలు ఉంటే బయటపెట్టండి. టీడీపీతో లాలూచీ పడ్డ మీరు… పట్టాభి వంటి నేతలతో ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టిస్తున్నారు. అసలు లిక్కర్ అంటే ఏంటో కూడా తెలియదు. లిక్కర్ నేను తాగేదీ లేదు. నాకు లిక్కర్ బ్రాండ్ లు కూడా తెలివు. అలాంటి వ్యక్తిపై అర్థమవంతైన ఆరోపణలతో మాట్లాడండి. పురందేశ్వరి గారు.. లిక్కర్ ఆధారాలు ఉంటే బయటపెట్టండి" అని సవాల్ విసిరారు.

ఏపీలో మద్యం సరఫరా పేరుతో దందా చేస్తున్నారంటూ ఇటీవలే పురందేశ్వరి ఆరోపించారు. అదాన్ అనే కంపెనీ వెనుక ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారని అన్నారు. ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పోరేషన్ లో వందకు పైగా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయని చెప్పారు. వీటిలో 16 కంపెనీల ద్వారానే 74 శాతం మద్యం సేకరణ జరుగుతుందని అన్నారు. అదాన్ డిస్టలరీస్ 2019 లో హైదరాబాద్ సాగర్ సొసైటీ ప్లాట్ నెంబర్ 16 నుంచి లో ప్రారంభించారన్నారు. ఈ అదాన్ కంపెనీకి 1,160కోట్ల కేటాయింపు జరిగిందని వివరించారు. ఆదాన్ డిస్లరీస్ వెనుక విజయసాయిరెడ్డి ఉన్నట్లు మాకు సమాచారం ఉందని తెలిపారు.ఎస్పీవై అగ్రస్ సంస్థకు రూ. 1800 కోట్ల మేర సరఫరా ఆర్డర్స్ ఉన్నాయని, ఈ సంస్థ వెనుక మిధున్ రెడ్డిఉన్నారని పురంధరేశ్వరి ఆరోపించారు.

Whats_app_banner