NFIR Rankings: ఎన్ఐఆర్ఎఫ్‌లో ఏపీ, తెలంగాణ విద్యా సంస్థ‌ల ర్యాంకులు ఎక్క‌డ‌ంటే, ఏపీలో ఆ యూనివర్శిటీకే ర్యాంకులు..-where are the ranks of ap and telangana educational institutes in nirf ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nfir Rankings: ఎన్ఐఆర్ఎఫ్‌లో ఏపీ, తెలంగాణ విద్యా సంస్థ‌ల ర్యాంకులు ఎక్క‌డ‌ంటే, ఏపీలో ఆ యూనివర్శిటీకే ర్యాంకులు..

NFIR Rankings: ఎన్ఐఆర్ఎఫ్‌లో ఏపీ, తెలంగాణ విద్యా సంస్థ‌ల ర్యాంకులు ఎక్క‌డ‌ంటే, ఏపీలో ఆ యూనివర్శిటీకే ర్యాంకులు..

HT Telugu Desk HT Telugu
Aug 13, 2024 07:02 AM IST

NFIR Rankings: దేశంలోని విద్యా సంస్థ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తి ఏటా ఇచ్చే నేష‌న‌ల్ ఇన్‌స్ట్సిట్యూష‌న‌ల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్‌వ‌ర్క్ (ఎన్ఐఆర్ఎఫ్‌) ర్యాంకింగ్స్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌కు చెందిన విద్యా సంస్థ‌లు ఒక్క‌టి కూడా మొద‌టి ప‌ది స్థానాల్లో నిల‌వ‌లేదు.

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్ విడుదల
ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్ విడుదల

NFIR Rankings: దేశంలోని విద్యా సంస్థ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తి ఏటా ఇచ్చే నేష‌న‌ల్ ఇన్‌స్ట్సిట్యూష‌న‌ల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్‌వ‌ర్క్ (ఎన్ఐఆర్ఎఫ్‌) ర్యాంకింగ్స్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌కు చెందిన విద్యా సంస్థ‌లు ఒక్క‌టి కూడా మొద‌టి ప‌ది స్థానాల్లో నిల‌వ‌లేదు. ఎన్ఐఆర్ఎఫ్ 9వ ఎడిష‌న్ వివ‌రాల‌ను సోమ‌వారం ఢిల్లీలోని భార‌త్ మండ‌పంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ విడుద‌ల చేశారు.

ఓవ‌రాల్ ర్యాంకింగ్స్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌‌లోని కోనేరు లక్ష్మయ్య యూనివ‌ర్శిటీకి40వ ర్యాంక్‌, విశాఖలోని ఆంధ్రా యూనివ‌ర్శిటీకి 41వ ర్యాంక్‌, ఆచార్య నాగార్జున యూనివ‌ర్శిటీకి 97వ ర్యాంక్‌లో దక్కాయి.

ఓవ‌ర‌ల్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ‌కు చెందిన ఐఐటీ హైదాదాబాద్ 12వ ర్యాంక్‌ లభించింది. హెచ్‌సియూకు 25వ ర్యాంక్, ఎన్ఐటి వ‌రంగ‌ల్ 53వ ర్యాంక్, ఉస్మానియా యూనివ‌ర్శిటీ 70వ ర్యాంక్‌ల్లో నిలిచాయి.

యూనివ‌ర్శిటీ కేట‌గిరీ

యూనివ‌ర్శిటీ కేట‌గిరీలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన కేఎల్ యూనివ‌ర్శిటీకి 22వ ర్యాంక్‌, ఆంధ్రా యూనివ‌ర్శిటీ 25వ ర్యాంక్‌, ఆచార్య నాగార్జున యూనివ‌ర్శిటీ 59వ ర్యాంక్‌, విజ్ఞాన్ యూనివ‌ర్శిటీ 72వ ర్యాంక్‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర యూనివ‌ర్శిటీ 87వ ర్యాంక్‌లో నిలిచాయి. తెలంగాణ‌కు చెందిన హెచ్‌సీయూ, హైద‌రాబాద్ 17వ ర్యాంక్‌, ఉస్మానియా యూనివ‌ర్శిటీ 43వ ర్యాంక్‌, ట్రిపుల్ ఐటీ 74 వ ర్యాంక్‌లో నిలిచాయి.

ఇంజ‌నీరింగ్ కేట‌గిరీలో….

ఇంజ‌నీరింగ్ కేట‌గిరీలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన కేఎల్ యూనివ‌ర్శిటీకి 35వ ర్యాంక్‌, ఐఐటీ, తిరుప‌తి 61వ ర్యాంక్‌, ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ, విశాఖ‌ప‌ట్నం 90వ ర్యాంక్‌, విజ్ఞాన్ యూనివ‌ర్శిటీ, గుంటూరు 91వ ర్యాంక్ సాధించాయి.

తెలంగాణకు చెందిన ఎన్ఐటీ వ‌రంగ‌ల్ 21వ ర్యాంక్, ట్రిపుల్ ఐటీ, హైద‌రాబాద్ 47వ ర్యాంక్‌, హెచ్‌సీయూ, హైద‌రాబాద్ 70 ర్యాంక్‌, జేఎన్‌టీయూ, హైద‌రాబాద్ 88వ ర్యాంక్‌, ఎస్ఆర్ యూనివ‌ర్శిటీ, వ‌రంగ‌ల్ 98వ ర్యాంక్ సాధించాయి.

మేనేజ్‌మెంట్ కేట‌గిరీలో..

మేనేజ్‌మెంట్ కేట‌గిరీలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఐఐఎం, విశాఖ‌ప‌ట్నం 26వ ర్యాంక్‌, కేఎల్ యూనివ‌ర్శిటీ 79వ ర్యాంక్‌, క్రియా యూనివ‌ర్శిటీ, శ్రీ‌సిటీ 99వ ర్యాంక్ సాధించాయి.

తెలంగాణ‌కు చెందిన ఐసీఎఫ్ఏఐ, హైద‌రాబాద్ 39వ ర్యాంక్‌, ఎన్ఐఏఈఎం, హైద‌రాబాద్ 96వ ర్యాంక్‌, ఐఎంటీ, హైద‌రాబాద్ 97వ ర్యాంక్‌, ఎన్ఐటీ, వ‌రంగల్ 100వ ర్యాంక్ సాధించాయి.

లా కేట‌గిరీలో…

లా కేట‌గిరీలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన విశాఖపట్నంలోని అంబేద్క‌ర్ లా కాలేజీ, కి 16వ ర్యాంక్‌, జీఐటీఎం, విశాఖ‌ప‌ట్నం 37వ ర్యాంక్‌, దామోద‌ర్ సంజీవ‌య్య నేష‌న‌ల్ లా యూనివ‌ర్శిటీ 39వ ర్యాంక్ సాధించాయి. తెలంగాణ‌లో హైదరాబాద్‌లోని ఐసీఎఫ్ఏఐ, 36వ ర్యాంక్ సాధించింది.

ఆర్కిటెక్చ‌ర్ కేట‌గిరీలో…

ఆర్కిటెక్చ‌ర్ కేట‌గిరీలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌‌లోని విజయవాడలో ఉన్న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చ‌ర్‌కు 16వ ర్యాంక్‌, విశాఖ‌ప‌ట్నం జీఐటీఎం,39వ ర్యాంక్ సాధించింది.

ఫార్మసీ కేట‌గిరీలో

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఏయూ కాలేజీ ఆఫ్ ఫార్మ‌సీ (ఏయూ), విశాఖ‌ప‌ట్నం 34వ ర్యాంక్‌, గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అండ్ మేనేజ్‌మెంట్, విశాఖ‌ప‌ట్నం 48వ ర్యాంక్‌, శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా యూనివ‌ర్శిటీ, తిరుప‌తి 60వ ర్యాంక్‌, ఆచార్య నాగార్జున యూనివ‌ర్శిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మ‌సీ, గుంటూరు 63వ ర్యాంక్‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర కాలేజీ ఆఫ్ ఫార్మ‌సీ, చిత్తూరు 79వ ర్యాంక్‌, విష్ణు కాలేజీ ఆఫ్ ఫార్మ‌సీ, భీమ‌వ‌రం 92 వ ర్యాంక్ సాధించాయి.

తెలంగాణ‌కు చెందిన అనురాగ్ యూనివ‌ర్శిటీ, హైద‌రాబాద్ 71వ ర్యాంక్‌, విష్ణు ఇన్ట్సిట్యూట్ ఆఫ్ ఫార్మ‌సీ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్, తెలంగాణ 87వ ర్యాంక్‌, కాక‌తీయ యూనివ‌ర్శిటీ, వ‌రంగల్ 88వ ర్యాంక్, సిఎంఆర్ కాలేజీ ఆఫ్ ఫార్మ‌సీ 95వ ర్యాంక్‌ సాధించాయి.

అగ్రిక‌ల్చ‌ర‌ల్ కేట‌గిరీలో

అగ్రిక‌ల్చ‌రల్ కేట‌గిరీలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఎన్‌జీ రంగా అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్శిటీ, గుంటూరు 26వ ర్యాంక్‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర వెటర‌ర్నీ యూనివ‌ర్శిటీ, తిరుప‌తి 33వ ర్యాంక్ సాధించింది. తెలంగాణ‌కు చెందిన ప్రొఫెస‌ర్ జ‌యశంక‌ర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చ‌ర‌ల్ యూనివ‌ర్శిటీ, హైద‌రాబాద్ 37వ ర్యాంక్ సాధించింది.

రాష్ట్ర ప్ర‌భుత్వ యూనివ‌ర్శిటీ కేట‌గిరీలో…

రాష్ట్ర ప్ర‌భుత్వ యూనివ‌ర్శిటీ కేట‌గిరీల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఆంధ్రా యూనివ‌ర్శిటీ, విశాఖ‌ప‌ట్నం 7వ ర్యాంక్‌, ఆచార్య నాగార్జున యూనివ‌ర్శిటీ, గుంటూరు 20వ ర్యాంక్‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర యూనివ‌ర్శిటీ, తిరుప‌తి 39వ ర్యాంక్ సాధించాయి. తెలంగాణ‌కు చెందిన ఉస్మానియా యూనివ‌ర్శిటీ, హైద‌రాబాద్ 6వ ర్యాంక్ సాధించింది.

మెడిక‌ల్ కేట‌గిరీలో..

మెడిక‌ల్ కేట‌గిరీలో తెలంగాణ‌కు చెందిన ఉస్మానియా మెడిక‌ల్ కాలేజీ, హైద‌రాబాద్ 48వ ర్యాంక్‌లో నిలిచింది. డెంట‌ల్ కేట‌గిరీలో ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంట‌ల్ సైన్సెస్, సికింద్రాబాద్ 40వ ర్యాంక్‌లో నిలిచింది. రీసెర్చ్ కేట‌గిరీలో తెలంగాణాకు చెందిన ఐఐటీ, హైద‌రాబాద్ 15 ర్యాంక్‌, హెచ్‌సీయూ హైద‌రాబాద్ 28వ ర్యాంక్‌లు సాధించాయి. ఇన్నోవేష‌న్ కేట‌గిరీలో తెలంగాణ‌కు చెందిన ఐఐటి, హైద‌రాబాద్ మూడో ర్యాంక్ సాధించింది.

దేశంలోనే అగ్ర‌గామి ఐఐటీ మ‌ద్రాస్

దేశంలోనే ఓవ‌ర‌ల్ కేట‌గిరీలో అత్యుత్త‌మ విద్యా సంస్థ‌ల్లో ఐఐటీ మ‌ద్రాస్ అగ్రామిగా నిలిచింది. త‌రువాత స్థానాల్లో ఐఐఎస్‌సీ బెంగ‌ళూరు, ఐఐటీ ముంబాయి, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ, కాన్పూర్‌, ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌, ఎయిమ్స్‌, ఢిల్లీ, ఐఐటీ రూర్కీ, ఐఐటీ గౌహ‌తి, జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్శిటీ (జేఎన్‌యూ) స్థానాల్లో నిలిచాయి.