GVMC Water Supply : గ్రేటర్ విశాఖ వాసులకు అలర్ట్... ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
గ్రేటర్ విశాఖ వాసులకు అధికారులు అలర్ట్ ఇచ్చారు. రేపు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను బంద్ చేయనున్నట్టు వెల్లడించారు. వాటర్ బోర్డు పనుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల వివరాలను పేర్కొంది.
విశాఖ నగర వాసులకు జీవీఎంసీ అధికారులు కీలక అలర్ట్ ఇచ్చారు. రేపు (శనివారం) పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను బంద్ చేయనున్నట్టు వెల్లడించారు. వాటర్ బోర్డు పనుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.
కొమ్మాది పంపు హౌస్‌లో పంపు సెట్ల మరమ్మతుల కొనసాగుతున్నాయని పేర్కొంది. మరమ్మత్తు పనుల కారణంగా అక్టోబర్ 26వ తేదీన (శనివారం) న అనేక ప్రాంతాల్లో తాగునీటి సరఫరా అంతరాయం ఉంటుందని జీవీఎంసీ ప్రకటించింది.
అంతరాయం కలిగే జోన్లు, ప్రాంతాల వివరాలు:
జోన్ 2 పరిధిలోని 8, 9, 10, 11, 12 వార్డుల్లోని సాగర్ నగర్, గుడ్లవాని పాలెం, ఎండాడ, రాజీవ్ నగర్, ఋషికొండ, గాంధీ నగర్, అన్నా నగర్, సూర్యతేజ నగర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుంది. ఇక జోన్ 3లో చూస్తే… 20, 22 వార్డుల పరిధిలోని ఎం.వి.పి. సెక్టార్స్ 1-7, 9-11, పోలమాంబ గుడి లైన్, ప్రశాంతి నగర్, మంగాపురం కాలనీ ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
ప్రజలకు తాగునీటికి అసౌకర్యం కలగకుండా ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేయబడుతుందని అధికారులు తెలిపారు. ఈ అసౌకర్యానికి నగర ప్రజలు సహకరించాలని కోరారు.