Sajjala On Chandrababu : చంద్రబాబు జైల్లో ఉన్నా బయట ఉన్నా ఒకటే, బెయిల్ వస్తే నిర్దోషి అయిపోరు- సజ్జల-vijayawada news in telugu ysrcp sajjala criticized chandrababu released on bail ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Vijayawada News In Telugu Ysrcp Sajjala Criticized Chandrababu Released On Bail

Sajjala On Chandrababu : చంద్రబాబు జైల్లో ఉన్నా బయట ఉన్నా ఒకటే, బెయిల్ వస్తే నిర్దోషి అయిపోరు- సజ్జల

Bandaru Satyaprasad HT Telugu
Nov 20, 2023 06:59 PM IST

Sajjala On Chandrababu : చంద్రబాబుకు బెయిల్ వచ్చినంత మాత్రాన నిర్దోషి అయిపోరని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నా బయట ఉన్నా ఒక్కటే అన్నారు.

సజ్జల రామకృష్ణా రెడ్డి
సజ్జల రామకృష్ణా రెడ్డి

Sajjala On Chandrababu : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. చంద్రబాబు బెయిల్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. కోర్టు చేసిన వ్యాఖ్యలు చూపకుండా ఎల్లో మీడియా హడావుడి చేస్తుందని ఆరోపించారు. రాజకీయ సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నా బయట ఉన్నా ఒకటే అన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాల్సి వస్తుందన్నారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదన్నారు. ఈ కేసులో సీఐడీ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, విచారణ ఎదుర్కోక తప్పదన్నారు. చంద్రబాబుకు హైకోర్టు కేవలం బెయిల్ మాత్రమే ఇచ్చిందన్నారు. అరెస్టైనప్పటి నుంచి స్కిల్ కేసు గురించి చంద్రబాబు అస్సలు మాట్లాడడం లేదన్నారు. చంద్రబాబుపై ఇంకా చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం కేసులను చంద్రబాబు ఎదుర్కోవాలని సజ్జల తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

చంద్రబాబు డైరెక్షన్ లోనే

చంద్రబాబు షెల్‌ కంపెనీల పేరుతో ప్రజల సొమ్మును దోచేశారని సజ్జల ఆరోపించారు. ఫేక్‌ ఇన్వాయిస్‌లతో రూ.241 కోట్లు దారిమళ్లించారన్నారు. కిలారి రాజేశ్‌, పెండ్యాల శ్రీనివాస్‌లకు ఐటీ నోటీసులు ఇచ్చారని, అన్నీ బయటపడ్డాయన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే స్కిల్‌ డెవలప్మెంట్ స్కామ్‌ జరిగిందని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు న్యాయవాదులు ఏ రోజూ స్కిల్‌ స్కామ్‌ జరగలేదని వాదించలేదన్నారు. చంద్రబాబు త్వరలో విజయయాత్ర చేస్తామంటున్నారని, అనారోగ్యం ఉంటే ఆయన యాత్రలు ఎలా చేస్తారని సజ్జల ప్రశ్నించారు.

బెయిల్ వస్తే నిర్దోషి అయిపోరు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పాత్ర ఉందని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. సీఎం నిధులు విడుదల చెయ్యమంటేనే విడుదల చేశామని ఆర్థిక శాఖ అధికారులు చెప్పినట్లు తెలిపారు. నిధుల విడుదలకు చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారన్నారు. చంద్రబాబు 70 ఏళ్ల ముసలాయన కాబట్టి బెయిల్ ఇమ్మని కోర్టును కోరారన్నారు. బెయిల్ వచ్చినంత మాత్రమే అంతా అయిపోలేదన్నారు. బెయిల్ కోసం చంద్రబాబుకు గుండె జబ్బు నుంచి చాలా రోగాలు ఉన్నట్లు చూపించారన్నారు. టీడీపీ నేతలు స్కిల్ కేసుతో సంబంధం లేదని ఎప్పుడూ మాట్లాడడం లేదని సజ్జల అన్నారు. జైలులో దోమలు ఉన్నాయని, చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదని, గుండె సమస్యలు ఉన్నాయని, చర్మ సమస్యలు వచ్చాయని, 70 ఏళ్ల వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారని తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. చంద్రబాబుకు కోర్టు బెయిల్ ఇస్తే దానికి ఆయన నిర్దోషి అన్నట్లు టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారన్నారు.

WhatsApp channel