Telugu Girls Arrested in US : కాజేసేందుకు యత్నం...! అమెరికాలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు అరెస్ట్
Telugu Girls Caught Shoplifting in US: అమెరికాలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు అరెస్ట్ అయ్యారు. షాపింగ్ కు వెళ్లిన వీరు కొన్ని వస్తువులకు మాత్రమే బిల్లు చెల్లించి ఎక్కువ వస్తువులను తీసుకునేందుకు యత్నించటంతో దొరికిపోయారు.
Telugu Girls Caught Shoplifting in US: అమెరికాలో ఇద్దరు తెలుగు అమ్మాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ స్టోర్ లో షాపింగ్ చేసిన వీరు ఎక్కువ వస్తువులు తీసుకున్నప్పటికీ కొన్నింటికి మాత్రమే డబ్బులు చెల్లించారు. మిగతా వస్తువులను డబ్బులను చెల్లించకుండానే కాజేసేందుకు యత్నించటంతో అక్కడి సిబ్బంది గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు వీరిద్దరని అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మార్చి 19వ తేదీన అమెరికాలోని న్యూజెర్సీలో జరిగింది.
అరెస్ట్ అయిన ఇద్దరు అమ్మాయిలు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు. ఒకరు హైదరాబాద్ కు చెందిన వారు కాగా… మరో అమ్మాయిది ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా. షాప్ లిఫ్టింగ్ కింద వీరిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. షాప్ లిఫ్టింగ్(shoplifting) అంటే… దొంగతనంలోనే ఇదో రకమైన మోసం. ఇందుకు సంబంధించిన సెక్షన్ కింద వీరిని బుక్చేశారు.
అసలేం జరిగిందంటే..?
ఈ ఇద్దరు అమ్మాయిలు షాపింగ్ చేసేందుకు ఓస్టోర్ కు వెళ్లారు. అక్కడ కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేశారు. అయితే వీటిలో కొన్నింటికి మాత్రమే డబ్బులు చెల్లించి… మిగతా వాటిని కాజేసేందుకు యత్నించారు. దీన్ని గమనించిన షాప్ యాజమాని…హోబోకెన్(Hoboken) పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఎంట్రీ ఇచ్చి విచారణ జరిపారు. అక్కడి సీసీ పుటేజీలను పరిశీలించారు. చేసింది తప్పు అని నిర్ధారించి వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇద్దరు అమ్మాయిలు…వివరణ ఇచ్చుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు మాత్రం లీగల్ ప్రొసిజర్ గురించి చెప్పి అదుపులోకి తీసుకున్నారు.
తీసుకున్న వస్తువులకు అవసరమైతే ఎక్కువ డబ్బులు చెల్లిస్తామని ఓ అమ్మాయి వివరించే ప్రయత్నం చేసింది. ఇకపై ఇలా చేయబోమని మరో అమ్మాయి చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు మాత్రం… వారికే సర్దిచెప్పి న్యాయపరంగా ముందుకెళ్లాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సంఘటన మార్చి 19వ తేదీన జరిగింది.