తెలుగు న్యూస్ / ఫోటో /
Tiruchanoor: వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు
- Vasanthostavam at Tiruchanoor 2023: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ముగిశాయి. వసంతోత్సవాన్ని పురస్కరించుకుని.. పలు సేవలను రద్దు చేశారు అధికారులు. మహాపూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు పూర్తి అయ్యాయి.

(1 / 6)
చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. (facebook)
(2 / 6)
మధ్యాహ్నం 2-30 గంటల నుండి స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పండ్లరసాలతో అభిషేకం చేశారు.(facebook)
(3 / 6)
రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.(facebook)
(4 / 6)
వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు.(facebook)
(5 / 6)
వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. 2.30 నుండి 4.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.(facebook)
ఇతర గ్యాలరీలు