Chandrababu In Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు-tdp president chandrababu visited tirumala venkateswara swamy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu In Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

Chandrababu In Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

Sarath chandra.B HT Telugu
Dec 01, 2023 09:47 AM IST

Chandrababu In Tirumala: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తిరుమల వేంకటే‌శ్వర స్వామిని దర‌్శించుకున్నారు. ఉదయం సతీమణి భువనేశ్వరితో కలిసి స్వామి వారి దర్శనం చేసుకున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత చంద్రబాబు
తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత చంద్రబాబు

Chandrababu In Tirumala: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తిరుమల వేంకటే‌శ్వర స్వామి వారికి మొక్కులు సమర్పించుకున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాములో అరెస్ట్ , రిమాండ్ తర్వాత గత నెలలో చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది. కంటి శస్త్ర చికిత్సకు మంజూరు చేసిన బెయిల్‌ను హైకోర్టు సాధారణ బెయిల్‌గా మార్చడంతో చంద్రబాబు తిరుమలలో మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చారు. ఆలయ అధికారులు చంద్రబాబుకు స్వాగతం పలికారు.

ధర్మపరిరక్షణ క్షేత్రమైన వెంకటేశ్వర స్వామిని మొక్కులు చెల్లించుకోడానికి దర్శించుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. వెంకటేశ్వరుడి పాదపద్మాల చెంత పుట్టి పెరిగిన తాను అంచలంచెలుగా పెరిగి ప్రజా సేవకు అంకితం అయ్యానని బాబు గుర్తు చేసుకున్నారు. వెంకటేశ్వరుడు తమబ ఇంటి దైవమని, ఆయన్ని దర్శించుకుని ఏ కార్యక్రమం అయినా చేపడతానని బాబు చెప్పారు.

2003 బ్రహ్మోత్సవాలలో సంప్రదాయం ప్రకారం పట్టువస్త్రాలు సమర్పించడానికి వచ్చినపుడు అలిపిరిలో 24క్లైమోర్ మైన్స్ పేల్చినా కూడా వెంకటే‌శ్వరుడి దయతోనే బతికానని చెప్పారు. ఆయన ప్రాణ బిక్ష పెట్టారని తాను నమ్ముతానని మొన్న కష్టాలు వచ్చినప్పుడు కూడా వెంకటేశ్వరుడిని వేడుకున్నానని, ఆ మొక్కులు తీర్చుకోడానికి తిరుమల వచ్చానని చెప్పారు.

ఆయనకు మొక్కులు చెల్లించిన తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేపట్టాలని, దర్శనం తర్వాత మొక్కులు చెల్లించి మిగిలిన పనులు ప్రారంభిస్తానని చెప్పారు. ధర్మాన్ని కాపాడాలని కోరుకున్నట్లు చెప్పారు. కలియుగంలో వెంకటేశ్వరుడి అవతరంలో ధర్మాన్ని పరిరక్షించేందుకు వచ్చాడని, ధర్మాన్ని కాపాడాలని స్వామిని వేడుకున్నట్లు బాబు చెప్పారు.

దేశంలో తెలుగు జాతి ప్రపంచంలో నంబర్ వన్ జాతిగా ఉండాలని అకాంక్షించారు. రానున్న రోజుల్లో ప్రపంచంలో అత్యున్నత నాగరికత ఉన్న భారతదేశం అత్యున్నత స్థానంలో ఉండాలని, తెలుగు వారు మంచి స్థానాల్లో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

తన సంకల్పం ముందుకు తీసుకువెళ్లే శక్తి, సామర్ధ్యం తెలివితేటలు ఇవ్వాలని స్వామి వారిని కోరుకున్నట్టు చెప్పారు. కష్టాల్లో ఉన్నపుడు తెలుగు ప్రజలే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా ప్రజలంతా సంఘీభావం చెప్పారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానన్నారు. మరో రెండు మూడు ఆలయాల్లో మొక్కులు చెల్లించాల్సి ఉందని వాటిని పూర్తి చేసిన తర్వాత మిగిలిన కార్యక్రమాలను ప్రారంభిస్తానన్నారు.

45ఏళ్లుగా ప్రజల కోసం ప్రపంచాన్ని అధ్యాయనం చేస్తూ భారతదేశం, తెలుగు వారికి ఉపయోగపడేలా పనిచేశానని, మళ్లీ తెలుగు వారికి ఉపయోగపడేలా పని చేస్తానని చంద్రబాబు చెప్పారు. . నంబర్ వన్ స్థానంలో తెలుగు ప్రజలు ఉండాలని, ఏ రాష్ట్రంలో వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడో అలాంటి ప్రజలు ముందుకు వెళ్లేలా సంకల్పం చేసుకున్నట్లు చెప్పారు.

Whats_app_banner