అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు-road accident at peddavadugur in anantapur district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు

HT Telugu Desk HT Telugu
Apr 01, 2022 06:03 AM IST

అనంతపుర జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 15 మంది గాయపడ్డారు.

<p>అనంతపుర జిల్లాలో ఘోర ప్రమాదం</p>
అనంతపుర జిల్లాలో ఘోర ప్రమాదం

అనంతపుర జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆగిఉన్న లారీని బస్సు ఢీకొట్టడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు లారీలో ఉన్న ఇద్దరు, బస్సులోని వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు.

ఈ ప్రమాదంలో మరో 15 మంది గాయపడ్డారు. తీవ్రగాయాలైన ఆరుగురిని అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.

Whats_app_banner