Janasena | జనసేన ఆవిర్భావ సభకు ఏపీ పోలీసులు అనుమతి.. మార్చి 14న కార్యక్రమం
జనసేన ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 14న జరగనుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు సభను ఏర్పాటు చేసేందుకు పోలీసుల అనుమతిని కోరారు. అయితే ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో సదరు పార్టీ నేత నాదేండ్ల మనోహర్ పోలీసుల తీరుపై మండిపడ్డారు.
ఎట్టకేలకు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు పోలీసులు అనుమతించారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించినట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ తెలిపారు. సభకు పోలీసులు ఆటంకం కల్పించడం సరికాదని మండిపడ్డారు. గురువారం లోపు సభకు అనుమతి ఇవ్వకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. మార్చి 14న తాడేపల్లి మండలం ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభను నిర్వహించనున్న సభ కోసం ఏర్పాటు చేసిన 12 కమిటీలతో నాదేండ్ల మనోహర్ చర్చించారు. ఈ సందర్భంగా పోలీసులు అనుతి ఇవ్వకపోయినా సభను నిర్వహించి తీరుతామని తేల్చి చెప్పారు.
అయితే నాదేండ్ల మనోహర్ హెచ్చరించిన కొద్ది సేపటికే పోలీసులు సభ నిర్వహణకు అనుతినివ్వడం గమనార్హం. కాకినాడ గ్రామీమ ప్రాంతానికి చెందిన వివిధ పార్టీల నేతలు మనోహర్ సమక్షంలో జనసేనలోకి చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ఆవిర్భావ దినోత్సవానికి అనుమతి కోరుతూ గత నెల 28న డీజీపీ లేఖ రాశామని, అయినా ఇప్పటివరకు స్పందించలేదని నాదేండ్ల మనోహర్ అన్నారు. పోలీసులు బందోబస్త్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా జనసైనికులు, వాలంటీర్లు, నాయకులు సభను నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. సభ నిర్వహణ కోసం 3 ప్రాంతాలు మారాల్సి వచ్చిందని, చివరకు ఇప్పటం గ్రామంలో రైతులు ధైర్యంగా ముందుకు వచ్చి స్థలం ఇచ్చారని స్పష్టం చేశారు. వైకాపా నేతలు ఎంత బెదిరించినా లెక్కచేయకుండా జనసేనకు సహకరించారని తెలిపారు.
సినీ పెద్దలు సీఎం జగన్‌కు సన్మానం చేయడానికి సిద్ధమవుతుండటం కామెడీ సీన్‌లా ఉందని వ్యాఖ్యానించారు. ఏపీలోని పేదలంతా ఒక్కసారిగా ధనవంతులయ్యారని అందుకే టికెట్ల ధరలు పెంంచారని ఎద్దేవా చేశారు. 7 లక్షల కోట్లు అప్పు తెచ్చి ప్రజలను ధనవంతులని చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సంక్షేమం పేరుతో దోపిడి జరుగుతుందని మండిపడ్డారు.
టాపిక్