CM Jagan : ఆ కేసులో బాధితుడిగా ఎన్ఐఏ కోర్టుకు సీఎం జగన్
NIA Court On CM Jagan : సీఎం జగన్ ఏప్రిల్ 10న హాజరుకావాల్సిందిగా ఎన్ఐఏ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఆయన పీఏ నాగేశ్వరరెడ్డికి కూడా హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది.
విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు(NIA Court)కు హాజరుకావాలని సీఎం జగన్ కు ఆదేశాలు వెళ్లాయి. ఏప్రిల్ పదో తేదీన ఈ మేరకు జగన్ హాజరుకానున్నారు. ఆయనతోపాటుగా పీఏ నాగేశ్వరరెడ్డి కూడా హాజరుకావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశాలిచ్చింది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్ పోర్టు(Visakha Airport)లో జరిగిన దాడి ఘటనపై విచారణలో భాగంగా ఈ ఆదేశాలు వెళ్లాయి. బాధితుడు జగన్ కచ్చితంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది. ఏప్రిల్ పదో తేదీన సీఎం జగన్ హాజరు అయ్యే అవకాశం ఉంది.
ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తి(Kodi Kathi)తో దాడి చేశాడు. దాాదపు నాలుగేళ్లుగా నిందితుడు రిమాండ్‌లోనే ఉన్నాడు. ️ఈ కేసు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో కొనసాగుతోంది. కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణకు జగన్‌ను కూడా కోర్టులో హాజరుపరచాలని ఎన్ఐఏను న్యాయస్థానం ఆదేశించింది.
ఎయిర్ పోర్ట్ క్యాంటిన్ లో పని చేసే.. శ్రీను అనే వ్యక్తి వీఐపీ లాంజ్ లోకి వెళ్లేందుకు అవకాశం కోసం చూశాడు. టీ, కాఫీలు ఇచ్చే ఉద్దేశంతో వెళ్లాడు. కోడికత్తితో జగన్ మీద దాడి చేశాడు. చిన్న గాయంతో జగన్ వెంటనే విమానం ఎక్కి వెళ్లిపోయారు. హైదరాబాద్(Hyderabad) చేరుకుని.. ఆసుపత్రిలో చేరారు. తొమ్మిది కుట్లేసినట్టుగా వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనమైంది.
శ్రీను జగన్ అభిమాని అని జగన్ పై సానుభూతి వచ్చేందుకు ఇలా చేశారని అని కొంతమంది అన్నారు. మరోవైపు ఇందులో టీడీపీ(TDP) నేతల కుట్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ కేసు ఎన్ఐఏకు వెళ్లింది. అప్పటి నుంచి విచారణ చేస్తూనే ఉంది. నిందితుడికి బెయిల్ ఇప్పించాలని అతడి కుటుంబం సీఎం జగన్ కు విజ్ఞప్తి చేసింది. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాస్ కు బెయిల్ కోరుతూ.. అతడి కుటుంబ సభ్యులు చేసిన దరఖాస్తులను కోర్టు కొట్టి వేసింది.
గతంలో విచారణ సందర్భంగా ఈ కేసుపై ఎన్ఐఏ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో ప్రధానమైన కోడికత్తి ఇంతకాలం ఎక్కడ ఉందని ప్రశ్నించింది. నేరానికి వాడిన కత్తి సంగతి ఏంటని అడిగింది. తమ ముందుకు తీసుకురావాలని ఆదేశించింది. అప్పట్లో ఈ కోడికత్తి వ్యవహారంపై వైసీపీ, టీడీపీల మధ్య మాటల దాడి జోరుగా సాగింది. ఒకరి మీద ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకున్నారు.
టాపిక్