Ancient Village : ఈ ఆధునిక కాలంలో ఓ ప్రాచీన గ్రామం-kurma an ancient village in srikakulam in this modern times ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ancient Village : ఈ ఆధునిక కాలంలో ఓ ప్రాచీన గ్రామం

Ancient Village : ఈ ఆధునిక కాలంలో ఓ ప్రాచీన గ్రామం

HT Telugu Desk HT Telugu
Dec 20, 2022 08:59 PM IST

Kurma Village srikakulam : ఉదయాన్నే లేవగానే.. ఫోన్ నోటిఫికేషన్లు టింగ్.. టింగ్.. అంటూ వినిపిస్తాయి. నిద్రమబ్బులోనే ఫోన్లో వచ్చిన అప్ డేట్స్ చూసుకోవాలి. ఆ తర్వాత వెళ్లి బ్రష్ చేసుకోవాలి... ఇదంతా మనం జీవించే విధానం. కానీ వీటన్నింటికీ ఓ గ్రామం పూర్తి భిన్నం. ఆధునిక కాలంలో ప్రాచీన గ్రామంగా ఉంది.

ఆధునిక కాలంలో ప్రాచీన గ్రామం
ఆధునిక కాలంలో ప్రాచీన గ్రామం

అక్కడ సోషల్ మీడియా(Social Media)లో గంటలు గంటలు గడపడం ఉండదు. ఉదయం.. ఫోన్ అలారంతో మెుదలుకాదు. బయటి ప్రపంచానికి.. అక్కడ జరుగుతున్న దానికి వేరేగా ఉంటుంది. అలా అని ఎక్కడో ఉందని అనుకోకండి.. ఆ గ్రామం శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలోనే ఉంది. కుర్మా గ్రామంగా ఇప్పటికే ప్రసిద్ధి చెందింది. తెల్లవారుజామున 4.30 గంటలకు నిద్రలేచి, హరతి, భగవంతుని స్తోత్రం చేస్తారు. 'ప్రసాదం' తీసుకున్న తర్వాత ఎవరి పనులు వారు చూసుకుంటారు.

ఇంటి పని కోసం ఆటోమేటిక్ గాడ్జెట్‌లు, వర్చువల్‌గా మీటింగ్స్ ఇలాంటివేవి కూర్మా గ్రామంలో ఉండవు. టెక్నాలజీ(Technology) లేని జీవితాన్ని గడుపుతున్నారు. ఎలాగూ కాలాన్ని వెనక్కు పంపలేరు.. కాబట్టి పద్ధతులేనా వెనకటిలా మార్చితే బెటర్ అనుకున్నారు. ఆధునిక జీవనశైలిని పక్కనపెట్టారు. వారు ఎలాంటి జీవితంలో గడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ విద్యార్థులకు ఎలాంటి ఫీజు ఉండదు. 16 మంది గురుకుల విద్యార్థులు(Students) ఉన్నారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కుర్మ గ్రామానికి ఎంటర్ కాగానే.. ప్రకృతిలోకి వెళ్తున్నాం.. అనే ఫీల్ కలుగుతుంది. స్వచ్ఛమైన గ్రామీణ భారతీయ జీవనశైలి.. వెల్ కమ్ చెప్పినట్టుగా అనిపిస్తుంది. గ్రామంలో కాంక్రీట్ ఇళ్లలో నివసించే బదులు మట్టితో కట్టిన ఇళ్లు కనిపిస్తాయి. ఈ గ్రామంలో ఇళ్ల నిర్మాణానికి ఇనుము, సిమెంటు(Cement) కూడా ఉపయోగించరు. ఇక్కడి గుడిసెలు భారతీయ సాంప్రదాయ పద్ధతిలో ఇసుక, సున్నం, బెల్లం.. తదితర మిశ్రమంతో నిర్మించారు. మనం ఉపయోగించినట్టుగా.. బట్టల కోసం ఎలాంటి డిటర్జెంట్ వాడరు. సహజ పదార్థాలనే వాడుతారు.

2018లో ఇంటర్నేషనల్ కృష్ణ కాన్షియస్‌నెస్ అసోసియేషన్ స్థాపకుడు స్వామి ప్రభుపాద స్థాపించారు. గ్రామ నివాసితులలో ఎక్కువ మంది సంపన్న నేపథ్యం నుండి వచ్చిన వారు కనిపిస్తారు. ఇక్కడ గ్రామీణ జీవనశైలిని నడిపిస్తారు. ఆహార ధాన్యాన్ని పండించుకుంటారు. ఈ ఏడాది సరిపడా కూరగాయలతోపాటు 198 బస్తాల ధాన్యం పండించారు.

200 ఏళ్ల నాటి భారతీయ గ్రామీణ జీవన విధానంలో ఇక్కడ బతుకుతున్నారు. ఇక్కడ 12 కుటుంబాలు, 16 మంది గురుకుల విద్యార్థులు, మొత్తం 56 మంది వరకు ఉంటున్నారు. నిత్యం చాలామంది వచ్చి సందర్శిస్తుంటారు. ఎవరైనా ఉండాలి అనుకుంటే కూడా ఉండొచ్చు. ప్రపంచం టెక్నాలజీ(Technology) అంటూ ముందుకు వెళ్తుంటే.. భారతీయ గ్రామీణ జీవనంలోనే ఆనందం అంటూ ఈ గ్రామస్థులు చెబుతున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే.. ఈ గ్రామానికి విదేశీయులు కూడా వస్తుంటారు.

Whats_app_banner