ISRO GSLV-F12 Success : జీఎస్ఎల్వీ-ఎఫ్12 ప్రయోగం సక్సెస్, కక్ష్యలోకి ఎన్వీఎస్-01 ఉపగ్రహాం!-isro launches gslv f12 rocket brought nvs 01 satellite into orbit successfully ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Isro Gslv-f12 Success : జీఎస్ఎల్వీ-ఎఫ్12 ప్రయోగం సక్సెస్, కక్ష్యలోకి ఎన్వీఎస్-01 ఉపగ్రహాం!

ISRO GSLV-F12 Success : జీఎస్ఎల్వీ-ఎఫ్12 ప్రయోగం సక్సెస్, కక్ష్యలోకి ఎన్వీఎస్-01 ఉపగ్రహాం!

Bandaru Satyaprasad HT Telugu
May 29, 2023 03:14 PM IST

ISRO GSLV-F12 Success : జీఎస్ఎల్వీ-ఎఫ్12 ప్రయోగం సక్సెస్ అయిందని ఇస్రో ప్రకటించింది. నిర్ణీత కక్ష్యలో ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని చేర్చినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

జీఎస్ఎల్వీ ఎఫ్12
జీఎస్ఎల్వీ ఎఫ్12 (Image Credit : ISRO Twitter)

ISRO GSLV-F12 Success : శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్ 12 ప్రయోగం విజయవంతం అయింది. సోమవారం ఉదయం 10.42 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్12 వాహకనౌక NVS-01 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఈ ప్రయోగానికి ఆదివారం ఉదయం 7.12 గంటల నుంచి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. నిరంతరాయంగా 27.30 గంటలపాటు కొనసాగిన కౌంట్ డౌన్ అనంతరం రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 పొడవు 51.7 మీటర్లు కాగా, బరువు 420 టన్నులు. ఈ వాహకనౌక 2232 కిలోల బరువున్న నావిక్‌ ఉపగ్రహం ఎన్‌వీఎస్‌-01 నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది. దీని ఉపగ్రహం జీవితకాలం 12 ఏళ్లని శాస్త్రవేత్తలు తెలిపారు. భారత భూభాగం చుట్టూ సుమారు 1500 కి.మీ పరిధిలో రియల్‌ టైమ్‌ పొజిషనింగ్‌ సేవలను అందించనుంది ఈ ఉప్రగ్రహం.

భారత రీజనల్ నేవిగేషన్ సిస్టమ్

ఇండియన్ రీజనల్ నేవిగేషన్ సిస్టమ్ ని రూపొందించుకునే ప్రయత్నం ఈ ప్రయోగం కీలకం కానుంది. అందుకే IRNSS-1A నుంచి ఇప్పటి వరకూ మొత్తం 9 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది ఇస్రో. 2013-2018 మధ్య మొత్తం 9 ఉపగ్రహ ప్రయోగాల్లో ఏడు సక్సెస్ అయ్యాయి. వీటిల్లో కొన్నింటికి కాలపరిమితి తీరిపోయింది. మరికొన్ని ఉపగ్రహాల పనితీరు సరిగాలేకపోవడంతో NVS-01 ఉపగ్రహాన్ని ప్రయోగించింది ఇస్రో. IRNSS-1G స్థానంలో NVS-01 సేవలందించేలా శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. NVS-01 ఇకపై పూర్తి స్థాయిలో సేవలందించనుంది. భారత నేవిగేషన్ వ్యవస్థకు ఈ ప్రయోగం చాలా కీలకమని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అన్నారు. భారత సరిహద్దుల్లోని 1500 కిలో మీటర్ల మేర ఈ నావిగేషన్ కవరేజ్‌ ఉండే విధంగా ఇస్రో రూపొందించింది.

12 ఏళ్ల పాటు సేవలు

ఈ శాటిలైట్ ప్రయోగం విజయవంతమైంది కాబట్టి 12 సంవత్సరాల పాటు దీని సేవలు వినియోగించుకోవచ్చని సోమనాథ్ తెలిపారు. నేవిగేషన్ వ్యవస్థ కోసం ఐదు కొత్త ఉపగ్రహాలు రూపొందించాలని పేర్కొంది. వీటిల్లో ఒకటి సక్సెస్ కావడంతో మరో నాలుగు ఉపగ్రహాల ప్రయోగాలు ఆరు నెలల గ్యాప్ తో నిర్వహిస్తామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఇండియన్ నేవిగేషన్ వ్యవస్థాలో భాగంగా... సాయుధ దళాలు, పౌర విమానయాన రంగానికి మెరుగైన పొజిషనింగ్, నేవిగేషన్ అండ్ టైమింగ్ కోసం వీటిని ఇస్రో రూపొందిస్తుంది. రెండో తరం నేవిగేషన్ శాటిలైట్ సిరీస్‌లలో NVS-01 మొదటిది. ఎల్ఐ బ్యాండ్‌లో కొత్త సేవలను కూడా ఈ శాటిలైట్ అందించనుంది.

IPL_Entry_Point