Indrakeeladri Hamsa Vahanam : కృష్ణానదికి వరద ప్రవాహం… తెప్పోత్సవం రద్దు-indrakeeladri hamsa vahanam festival cancelled in dasara last day ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Indrakeeladri Hamsa Vahanam : కృష్ణానదికి వరద ప్రవాహం… తెప్పోత్సవం రద్దు

Indrakeeladri Hamsa Vahanam : కృష్ణానదికి వరద ప్రవాహం… తెప్పోత్సవం రద్దు

HT Telugu Desk HT Telugu
Oct 04, 2022 01:26 PM IST

Indrakeeladri Hamsa Vahanam దేవీ శరన్నవరాత్రులు ముగింపు రోజు కృష్ణానదిలో హంస వాహనంపై అమ్మవారి నదీ విహారాన్ని ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ప్రకటించారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో ఎగువున కురుస్తున్న భారీ వర్షాలతో దిగువకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ ఏడాది సీజన్‌లో భారీ వర్షాలు కురవడంతో జలాశయాలు నిండుకుండల్లా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి లక్షలాది క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండటంతో నదిలో తెప్పోత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

<p>తెప్పోత్సవం రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కలెక్టర్‌ ఢిల్లీ రావు</p>
తెప్పోత్సవం రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కలెక్టర్‌ ఢిల్లీ రావు

Indrakeeladri Hamsa Vahanamనవరాత్రుల్లో బుధవారం రాజరాజేశ్వరిదేవి అలంకారములో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాల ముగింపులో భాగంగా దుర్గమ్మను, గంగామాత సమేత మల్లేశ్వరస్వామివార్లతో కృష్ణవేణి నదిమాతపై ఆనవాయితీ ప్రకారం జలవిహారం చేసే ఆచారం ఉంది. ఈ ఏడాది కృష్ణానదికి వరద నీరు ఉదృతిగా ఉన్నందున తెప్పోత్సవం నిర్వహణకు సాధ్యంకాదని జలనరులశాఖ అధికారులు తెలపడంతో నది తీరంలో హంస వాహనాన్ని నిలకడగానే నదిలో ఉంచి శ్రీగంగా, దుర్గ అమ్మవార్ల సమేత మల్లేశ్వరస్వామి తెప్పోత్సవం భక్తులకు కనువిందు చేయనున్నదని కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.

శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం 9వ రోజు కనకదుర్గమ్మ అమ్మవారు మహిషాసుర మర్దని దేవి అంకారంలో భక్తులకు దర్శన మిస్తున్నారు. అమ్మవారిని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు దర్శించుకున్నారు. దుర్గమ్మ దర్శనం అనంతరం క్యూలైన్లలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.విజయదశమి రోజున నిర్వహించే తెప్పోత్సవ నిర్వహణ నది ఒడ్డున జరుగనుంది.

జలవనరులశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్. తిరుమలరావు, రివర్ కన్జర్వేటర్ కృష్ణారావు మాట్లాడుతూ ఎగువ ప్రాంతాలైన శ్రీశైలంలో లక్షా 50 వేల క్యూసెక్కులు, నాగార్జున సాగర్ లో లక్ష క్యూసెక్కులు, పులిచింతలలో 90 వేల క్యూసెక్యులు నీటి నిల్వ ఉందన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుండి లక్షా 10 వేల క్యూసెక్కుల వరద నీటిని 70 గేట్లను రెండడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. ఇదే పరిస్థితి రెండు నుండి మూడు రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హంస వాహనంపై తెప్పోత్సవానని నిర్వహించడం కష్టమని ఇరిగేషన్ అధికారులు వివరించారు.

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిషాసుర మర్దని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ అమ్మవారిని మాజీ మంత్రి, శాసనసభ్యులు కొడాలి నాని దర్శించుకున్నారు. ఆలయ ఇవో భ్రమరాంబ నానికి స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అమ్మవారి ప్రసాదం అందజేశారు. సామాన్య భ‌క్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దుర్గ‌మ్మ‌ను ద‌ర్శ‌నం చేసుకొనేలా చేసిన ఏర్పాట్లు బాగున్నాయ‌ని అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్ర‌మం త‌ప్ప‌కుండా అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తున్నార‌న్నారు. రాష్ట్ర అభివృద్ధికి అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ మంచి జ‌రిగేలా చూడాల‌ని దుర్గ‌మ్మ‌ను ప్రార్థించిన‌ట్లు శాసనసభ్యులు అన్నారు.

Whats_app_banner