AP Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్… ఆ రెండు రోజులు భారీ వర్షాలు!-heavy rains likely in ap over low pressure area in bay of bengal ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్… ఆ రెండు రోజులు భారీ వర్షాలు!

AP Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్… ఆ రెండు రోజులు భారీ వర్షాలు!

HT Telugu Desk HT Telugu
Nov 10, 2022 08:35 AM IST

Low pressure area in Bay of Bengal: నైరుతి బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంగా ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏపీకి భారీ వర్ష సూచన
ఏపీకి భారీ వర్ష సూచన (twitter)

heavy rains likely in Andhrapradesh: నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఫలితంగా అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇదీ కాస్త మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఫలితంగా ఈ నెల 11, 12 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నెల 11వ తేదీ రాత్రికి తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీర ప్రాంతాలకు విస్తరించనుంది. బుధవారం ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తా, రాయల సీమలలో మేఘాలు ఆవరించాయి. గురువారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు తీరం వెంట బలమైన గాలులు వీచే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఫలితంగా సముద్రం అలజడిగా మారుతుందని... మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది.

ఏపీ వెదర మ్యాన్ ప్రకారం....

Rains in Andhrapradesh: అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వర్షాలు పడుతాయని ఏపీ వెదరమ్యాన్ చెప్పింది. రాష్ట్రంలోని దక్షిణ భాగాల్లో ఎక్కువగా కురుస్తాయని అంచనా వేసింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని.... కానీ నవంబర్ 11 తర్వాత భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. నవంబరు 11 నుంచి దక్షిణా కోస్తాంధ్ర భాగాలైన నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి నగరాల్లో మొదలై ఆ తర్వాత నుంచి కడప​, సత్యసాయి, అన్నమయ్య​, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోకి విస్తరించనుంది. అల్పపీడనం ఎఫెక్ట్ నవంబర్ 15 వరకు ఉండే అవకాశం ఉందని చెప్పారు.

Whats_app_banner