Vallabhaneni Vamsi : ఆ స్కాంతో సంబంధం లేదంటున్న వల్లభనేని వంశీ….
Vallabhaneni Vamsi కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ డిజిపికి ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులు కోట్లాది రుపాయల సంకల్ప సిద్ధి ఈ కార్ట్ కుంభకోణంలో తన ప్రమేయం ఉందని ప్రచారం చేయడంపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత కొద్ది రోజులుగా విజయవాడలో కలకలం రేపుతున్న వందల కోట్ల సంకల్ప సిద్ధి కుంభకోణానికి వైసీపీ నాయకులే సూత్రధారులని టీడీపీ ఆరోపిస్తోంది.
Vallabhaneni Vamsi మనీ సర్క్యూలేషన్ స్కీంతో వందల కోట్ల రుపాయలు కొట్టేసిన సంకల్ప సిద్ధి వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చాలంటూ ఎమ్మెల్యే వంశీ డిజిపికి ఫిర్యాదు చేశారు. దాదాపు ఏడాది వ్యవధిలో దాదాపు వందల కోట్ల రుపాయలు ప్రజల నుంచి సేకరించడం వెనుక కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించారని టీడీపీ ఆరోపిస్తోంది.
సంకల్ప సిద్ధి వ్యవహారంలో నిందితులు గుత్తా వేణుగోపాల కృష్ణా, గుత్తా కిరణ్ కుమార్‌లు ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలకు బినామీలుగా ఉన్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఏడాది వ్యవధిలో వందల కోట్లు కొల్లగొట్టడం వెనుక అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. 2022 మే 17న ప్రైవేట్ రిజిస్టర్ కంపెనీగా నమోదు చేసిన తర్వాత మూడు నెలల పాటు వల్లభనేని వంశీ అదృశ్యం అయ్యారని, ప్రజల నుంచి కొట్టేసిన డబ్బును బెంగుళూరు తరలించారని టీడీపీ ఆరోపిస్తోంది. లక్ష రుపాయల పెట్టుబడితో వైసీపీ నేతలు రూ.1100కోట్లను కొల్లగొట్టారని టీడీపీ ఆరోపిస్తోంది. వంశీ ప్రధాన అనుచరుడు రంగా సంకల్ప సిద్ధి వసూళ్ల వెనుక సూత్రధారిగా వ్యవహరించాడని టీడీపీ ఆరోపిస్తోంది.
డీజీపీకి ఫిర్యాదు….
టీడీపీ ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ డిజిపికి ఫిర్యాదు చేశారు. సంకల్పసిద్ది కేసులో టీడీపీ నేతల ఆరోపణలపై విచారణ చేయించాలని డీజీపీని కోరారు. తనపై సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సంకల్పసిద్ధి సంస్థతో తనకు, కొడాలి నానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. సంకల్ప సిద్ధి నిందితులు ఎవరూ తనకు తెలియదని వంశీ చెబుతున్నారు.
కోట్ల రుపాయల కుంభకోణంలో తనపై ఏ ఆధారం ఉన్నా శిక్షకు సిద్ధమని చెబుతున్నారు. పట్టాభి, బచ్చుల అర్జునుడు చేసిన ఆరోపణలపై డీజీపికి ఫిర్యాదు చేశానని చెప్పారను. తన ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని వంశీ ఆరోపించారు. టీడీపీ నేతలకు దమ్ముంటే ఆధారాలు చూపించాలని, ఈ కేసుపై అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తానని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రకటించారు. సంకల్ప సిద్ధి చీటింగ్ కేసుతో కొడాలి నానికి, తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు.
టీడీపీలో ఉంటే మంచోళ్లు.. లేకుంటే కాదా? అని వంశీ ప్రశ్నించారు. తనపై అసత్య ఆరోపణలు చేశారని, పట్టాభి, బచ్చుల అర్జునుడిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు వల్లభనేని వంశీ. సంకల్ప సిద్ధి కేసులో ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు.సంకల్ప సిద్ధి నిర్వాహకులు తనకు తెలియదన్న వంశీ కరోనాతో నేను హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటే అసత్య ఆరోపణలు చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసత్య ఆరోపణలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యేనని ఫైర్ అయ్యారు.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి నాపై ఆరోపణలు చేశారని, ఇది ప్రజల్లో మా ఇమేజ్ డ్యామేజ్ కలిగే అంశం అన్నారు.. టీడీపీ నేతలకు దమ్ము ఉంటే ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు. సంక్రాంతి పండుగ చేస్తున్నప్పుడు కూడా నేను క్యాసినో పెట్టా అని ప్రచారం చేశారన్నారని క్యాసినో కేసులో ఈడీ ఎంక్వైరి చేస్తే, తమ పేర్లు ఎక్కడైనా బయటకు వచ్చాయా అని నిలదీశారు.