Anantapur District : ఘోర రోడ్డు ప్రమాదం - కారును ఢీకొట్టిన లారీ, నలుగురు మృతి-four killed in fatal road accident in anantapur district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anantapur District : ఘోర రోడ్డు ప్రమాదం - కారును ఢీకొట్టిన లారీ, నలుగురు మృతి

Anantapur District : ఘోర రోడ్డు ప్రమాదం - కారును ఢీకొట్టిన లారీ, నలుగురు మృతి

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 22, 2024 01:30 PM IST

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుక్కరాయ సముద్రం రేకులకుంట సమీపంలో కారును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

ఘోర రోడ్డు ప్రమాదం
ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్పలలో ఓ వేడుకకు వెళ్లి వస్తుండగా ఇన్నోవా కారును లారీ ఢీకొట్టింది. బుక్కరాయ సముద్రం రేకులకుంట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులు అనంతపురం సిండికేట్ నగర్ వాసులుగా గుర్తించారు.

శనివారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న స్థానికులు… ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతపురం పట్టణానికి చెందిన ముస్తాక్, పవన్, శ్రీనివాసులు, వై.పవన్ ను మృతులుగా గుర్తించారు.

వీరు ఫ్రెండ్ బర్త్ డే వేడుకలో పాల్గొన్నారు. ఆ తర్వాత మరో స్నేహితుడిని కలిసేందుకు నార్పలకు వెళ్లేందుకు బయల్దేరారు. ఈ క్రమంలోనే వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు చనిపోయారు. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ జగదీశ్ పరిశీలించారు. చనిపోయిన నలుగురు యువకులే అని తెలిపారు.